Share News

Sanjay Malhotra: ఆర్‌బీఐ 26వ గవర్నర్‌గా సంజయ్ బాధ్యతలు స్వీకరణ.. ఈ నిర్ణయం తీసుకుంటారా..

ABN , Publish Date - Dec 11 , 2024 | 03:47 PM

రాజస్థాన్‌కు చెందిన 1990 బ్యాచ్ IAS అధికారి సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ 26వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పవర్, ఫైనాన్స్, టాక్సేషన్ వంటి ప్రధాన రంగాలలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సంజయ్ దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.

Sanjay Malhotra: ఆర్‌బీఐ 26వ గవర్నర్‌గా సంజయ్ బాధ్యతలు స్వీకరణ.. ఈ నిర్ణయం తీసుకుంటారా..
Sanjay Malhotra

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా వరుసగా రెండు పర్యాయాలు పూర్తి చేసిన శక్తికాంత దాస్ మంగళవారం పదవీవిరమణ చేశారు. ఈ క్రమంలో శక్తికాంత దాస్ పదవి నుంచి వైదొలగడంతో, సంజయ్ మల్హోత్రా (56) (Sanjay malhotra) డిసెంబర్ 11న బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 26వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో సంజయ్ మల్హోత్రా ఈరోజు ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకోగా, అక్కడ ఆయనకు సీనియర్ అధికారులు ఘన స్వాగతం పలికారు. సంజయ్ మల్హోత్రా ఈ పదవిలో 3 సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో సంజయ్ మల్హోత్రాతో పాటు డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్, ఎం. రాజేశ్వర్ రావు, టీ రబీ శంకర్ కూడా ఉన్నారు.


3 దశాబ్దాల అనుభవం

రాజస్థాన్‌కు చెందిన 1990 బ్యాచ్ IAS అధికారి అయిన సంజయ్ మల్హోత్రా పవర్, ఫైనాన్స్, టాక్సేషన్ వంటి ప్రధాన రంగాలలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. అయితే దేశం ద్రవ్యోల్బణంతో పాటు ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న తరుణంలో సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.c


రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు

జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతానికి తగ్గింది. ఇది గత 7 త్రైమాసికాల్లో కనిష్ట స్థాయికి చేరుకోవడం విశేషం. ఇది మాత్రమే కాదు, రిటైల్ ద్రవ్యోల్బణం రేటు కూడా అక్టోబర్‌లో 6.21 శాతానికి 14 నెలల గరిష్ట స్థాయికి పెరిగింది. ఈ క్రమంలో సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశం మరింత బలంగా ఉందని నిపుణులు భావిస్తున్నారు.


రెండేళ్లుగా రెపో రేటులో నో ఛేంజ్

శక్తికాంత దాస్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలో దాదాపు రెండేళ్లపాటు రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ఇటివల కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు శక్తికాంత దాస్ రెపో రేటును మార్చడం లేదని తెలిపారు. CPI ఆధారిత ద్రవ్యోల్బణం రేటును 2 శాతం హెచ్చుతగ్గులతో 4 శాతం లోపల ఉంచాలని ప్రభుత్వం RBIకి లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ, జీడీపీ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని, తదుపరి సమావేశంలో రెపో రేటును తగ్గించవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి:

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు

Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..


Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..

Free Government Schemes: ఉచిత పథకాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక శాఖ.. కారణమిదే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 11 , 2024 | 03:50 PM