Share News

Budget 2024: బడ్జెట్ 2024లో సెక్షన్ 80సీ పరిమితి పెంచుతారా.. ఆశలు నెరవేరుతాయా ?

ABN , Publish Date - Jun 27 , 2024 | 01:50 PM

వచ్చే నెల అంటే జూలై మొదటి వారం లేదా రెండో వారంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) 2024-2025కు పూర్తి బడ్జెట్‌ 2024ను(Budget 2024) సమర్పించనున్నారు. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితి పెంచాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Budget 2024: బడ్జెట్ 2024లో సెక్షన్ 80సీ పరిమితి పెంచుతారా.. ఆశలు నెరవేరుతాయా ?
section 80C limit be increase or not

వచ్చే నెల అంటే జూలై మొదటి వారం లేదా రెండో వారంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) 2024-2025కు పూర్తి బడ్జెట్‌ 2024ను(Budget 2024) సమర్పించనున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టకముందే ఉద్యోగులు సహా మధ్య తరగతి ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితి పెంచాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆదాయపు పన్ను సెక్షన్ 80C పరిధిలో మినహాయింపు పరిమితి ప్రస్తుతం రూ. 1.5 లక్షలుగా ఉంది. ఇది 2014 నుంచి ఇలాగే పెంచకుండా ఉంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని పెంచలేదు.


చెల్లింపుదారులు, ఉద్యోగులు

ఈ నేపథ్యంలో ఈ 80సీ పరిధిని(section 80C limit) పెంచాలని ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులు కోరుతున్నారు. గత బడ్జెట్ సమయంలో కూడా దీని పరిధిని పెంచాలని కోరగా పెంపు చేయలేదు. కానీ ఈసారి పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే గత పదేళ్లలో ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగింది. దీంతోపాటు నిత్యావసరాల ధరలు కూడా పెరిగాయి. అందుకే సెక్షన్ 80సీ పరిధిని పెంచాలంటున్నారు.


సెక్షన్ 80సీ ఎందుకు?

ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ అనేది పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగుల ఖర్చులపై పన్ను మినహాయింపు ఇచ్చే అంశం. ఇందులో జీవిత బీమా ప్రీమియం, PPF, ELSS మ్యూచువల్ ఫండ్, ట్యూషన్ ఫీజు, హోమ్ లోన్ సహా పలు చెల్లింపు అంశాలు ఉంటాయి. సెక్షన్ 80సీ పరిమితిని పెంచడం ద్వారా పదవీ విరమణ ప్రణాళిక, పిల్లల చదువులు, ఇల్లు కొనుగోలు వంటి వారి ఆర్థిక లక్ష్యాల విషయంలో చెల్లింపుదారులకు మరికొంత ఊరట లభించనుంది.


పరిధిలోకి వచ్చేవి

సెక్షన్ 80సీ మినహాయింపునకు అర్హత పొందాలంటే ఆయా వ్యక్తులు పలు పెట్టుబడి మార్గాల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. వాటిలో జీవిత బీమా ప్రీమియం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఉద్యోగుల భవిష్య నిధి (EPF), ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS), యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP), పన్ను సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, జాతీయ పెన్షన్ పథకం (NPS), హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటివి ఉన్నాయి. వీటిలో పెట్టుబడులు చేయడం ద్వారా మీకు గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.


ఇది కూడా చదవండి:

T20 World Cup 2024: నేడు ఇండియా, ఇంగ్లండ్ మధ్య కీలక మ్యాచ్.. గెలుపెవరిది?

Married Womens: ఈ కంపెనీలో పెళ్లైన మహిళలకు నో జాబ్స్.. తీవ్రంగా స్పందించిన కేంద్రం


For Latest News and Business News click here

Updated Date - Jun 27 , 2024 | 01:52 PM