Share News

Hyderabad: దూసుకొచ్చిన ‘ఆర్మీ’ బుల్లెట్‌.. మహిళ కాలికి గాయం

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:08 AM

అకస్మాత్తుగా ఓ బుల్లెట్‌ దూసుకొచ్చి.. ఇంట్లో దుస్తులు ఆరేస్తున్న మహిళ కాలిలోకి దిగింది. ఆ మహిళ హడలిపోయి కిందపడింది. నార్సింగ్‌ పోలీసుల కథనం ప్రకారం.. గోల్కొండ తారామతి మిలటరీ ఏరియా(Golconda Taramati Military Area)లో ఫైరింగ్‌ సెంటర్‌ ఉంది. ఆ పక్కన గంధంగూడ గ్రామం ఉంది.

Hyderabad: దూసుకొచ్చిన ‘ఆర్మీ’ బుల్లెట్‌.. మహిళ కాలికి గాయం

- గంధంగూడలో కలకలం సృష్టించిన ఘటన

హైదరాబాద్: అకస్మాత్తుగా ఓ బుల్లెట్‌ దూసుకొచ్చి.. ఇంట్లో దుస్తులు ఆరేస్తున్న మహిళ కాలిలోకి దిగింది. ఆ మహిళ హడలిపోయి కిందపడింది. నార్సింగ్‌ పోలీసుల కథనం ప్రకారం.. గోల్కొండ తారామతి మిలటరీ ఏరియా(Golconda Taramati Military Area)లో ఫైరింగ్‌ సెంటర్‌ ఉంది. ఆ పక్కన గంధంగూడ గ్రామం ఉంది. ఆ గ్రామంలో నివాసం ఉంటున్న పద్మ (34) మంగళవారం ఇంట్లో దుస్తులు ఆరేస్తుండగా, పెద్ద శబ్ధంతో ఆర్మీ ఫైరింగ్‌ సెంటర్‌ నుంచి ఓ బుల్లెట్‌(Bullet) దూసుకొచ్చి ఆమె కాలికి తగలడంతో కుప్పకూలింది.

ఇదికూడా చదవండి: Hyderabad: వార్నీ.. ఇదేంపని... సెల్‌ఫోన్‌ దొంగలతో ఖాకీల దోస్తీ..


పద్మ కుమార్తె 100కు ఫోన్‌చేయగా పోలీసులు ఆమెను గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందించి పంపించారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ బుల్లెట్‌ కాలికి తగిలింది కాబట్టి సరిపోయిందని, తలకో, ఇతర భాగాలకో తగిలి ఉంటే తన పరిస్థితి ఏంటని వాపోయారు. నార్సింగ్‌ పోలీసులు(Narsing Police) బులెట్‌ను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.


నెలలో రెండో ఘటన..

ఫైరింగ్‌ సెంటర్‌(Firing Centre) నుంచి జనాల్లోకి బుల్లెట్‌ దూసుకురావడం జూలైలో ఇది రెండో ఘటన. శిక్షణ తీసుకుంటున్న సమయంలో మిస్‌ఫైర్‌ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 15 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ ఇంటి బెడ్‌రూంలోకి బులెట్‌ దూసుకొచ్చింది. దాదాపు 60 సంవత్సరాలుగా ఫైరింగ్‌ సెంటర్‌ ఇక్కడే ఉంది. ఫైరింగ్‌ రేంజ్‌కు ఎంత దూరంలో ఇళ్లు ఉండాలనే అంశాన్ని పట్టించుకోకుండా నిర్మాణాలకు అధికారులు అనుమతులు ఇవ్వడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్టు స్పష్టమవుతున్నది.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 31 , 2024 | 11:11 AM