Share News

Hyderabad: బీజేపీ నాయకులపై బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ దాడి..

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:08 AM

దుండిగల్‌ మున్సిపాలిటీ(Dundigal Municipality) పరిధిలోని శంభీపూర్‌ గ్రామంలో హనుమాన్‌ ఆలయం వద్ద బీజేపీ నాయకులపై బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అనుచరులతో కలిసి దాడి చేశారు. సమాచారం అందుకున్న దుండిగల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరుపార్టీల నాయకులపై లాఠీలు ఝుళిపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Hyderabad: బీజేపీ నాయకులపై బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ దాడి..

- దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్: దుండిగల్‌ మున్సిపాలిటీ(Dundigal Municipality) పరిధిలోని శంభీపూర్‌ గ్రామంలో హనుమాన్‌ ఆలయం వద్ద బీజేపీ నాయకులపై బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అనుచరులతో కలిసి దాడి చేశారు. సమాచారం అందుకున్న దుండిగల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరుపార్టీల నాయకులపై లాఠీలు ఝుళిపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బీజేపీ నాయకుడు కేసారం శ్రీనివాస్‌ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి(Malkajigiri) ఎంపీగా ఈటల రాజేందర్‌ విజయం సాధించడంతో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో శంభీపూర్‌ గ్రామంలోని హన్‌మాన్‌ దేవాలయం వద్ద బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు.

ఇదికూడా చదవండి: BRS: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్‌ఎస్‌ పతనమైపోయిందిగా..


ఆ సమయంలో అక్కడికి నాలుగు కార్లలో వచ్చిన కౌన్సిలర్‌ శంభీపూర్‌ కృష్ణ, ఆయన అనుచరులు రమేష్‌, భిక్షపతి, జీతయ్య, కె.శ్రీశైలం, ఎం.శ్రీశైలం, శ్రీచంద్రశేఖర్‌, ఎస్‌.రమేష్‌, జి.మల్లేష్‌, కె.వినయ్‌, కె.అభి, కె.బబ్లూ, ఎ.వికాస్‌, ఎస్‌ దీపక్‌, ప్రభాకర్‌, మరికొతమంది వచ్చి ఇక్కడ ఎందుకు సంబరాలు చేసుకుటున్నారని బీజేపీ నాయకులను బెదిరించారు. వారికి కార్లను అడ్డుపెట్టి, ట్రాన్స్‌ ఫార్మర్‌ బంజేసి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. బీజేపీ నాయకుడు శ్రీనివాస్‏పై దాడి చేసి రెండు సెల్‌ ఫోన్‌లు లాక్కుని పగలగొట్టారు. కారు (నం. టీఎస్‌ 08 టీఆర్‌కెఎం1502) అద్దాన్ని పగలు కొట్టి, హ్యాండిల్‌ విరగొట్టి, బీజేపీ నాయకులు 8 మందిని దుర్భాషలాడి, కర్రలు, రాడ్లతో వారిపై దాడి చేశారు. ఈ మేరకు బాధితుడు కేసారం శ్రీనివాస్‌ దుండిగల్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 11:08 AM