Hyderabad: నిలువునా ముంచిన కేటుగాళ్లు.. లోన్ ఇప్పించి.. రూ.34.90 లక్షలు కొట్టేశారు
ABN , Publish Date - Jun 06 , 2024 | 11:58 AM
స్టాక్ మార్కెట్‌లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీవో)లో పెట్టుబడి పేరుతో.. సైబర్ కేటుగాళ్లు రుణం ఇప్పించి మరీ ఓ బాధితుడి నుంచి రూ.34.90 లక్షలు కొట్టేశారు. నగరానికి చెందిన సదరు బాధితుడి ఫిర్యాదుతో సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు(CCS Cybercrime Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- స్టాక్‌మార్కెట్ ఐపీవో పేరుతో మోసం..
- వాట్సాప్‌లో మెసేజ్.. ‘657 ఐసెకన్’ పేరుతో గ్రూప్
- ప్రత్యేక యాప్‌తో బురిడీ.. నిలువునా ముంచిన కేటుగాళ్లు
హైదరాబాద్ సిటీ: స్టాక్ మార్కెట్‌లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీవో)లో పెట్టుబడి పేరుతో.. సైబర్ కేటుగాళ్లు రుణం ఇప్పించి మరీ ఓ బాధితుడి నుంచి రూ.34.90 లక్షలు కొట్టేశారు. నగరానికి చెందిన సదరు బాధితుడి ఫిర్యాదుతో సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు(CCS Cybercrime Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన బాధితుడు వాట్సా్‌పలో స్టాక్‌మార్కెట్ పేరుతో వచ్చిన ఓ లింక్‌ను క్లిక్ చేశాడు. ‘657 ఐసెకన్’ అనే వాట్సాప్ గ్రూపులో అతడు యాడ్ అయ్యాడు. ఆ గ్రూప్‌లో 140 మంది సభ్యులున్నారు. వారంతా రోజువారీ వ్యూహాలు.. లాభాల గురించి చర్చించుకుంటున్నారు. గ్రూప్ అడ్మిన్ నుంచి ‘ఇంకా యాప్ డౌన్‌లోడ్ చేసుకోనివాళ్లు కింది లింక్ ద్వారా వివరాలను పంపొచ్చు’ అనే సందేశాన్ని పోస్ట్ చేశాడు. దానికి బాధితుడు స్పందించడంతో.. వ్యక్తిగత వివరాలను సేకరించి, అతడితో ఫేక్ బ్రోకరేజ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: బీజేపీ నాయకులపై బీఆర్‌ఎస్ కౌన్సిలర్ దాడి..
అందులో ట్రేడింగ్ చేసే సదుపాయం కల్పించారు. శివం కెమెకిల్స్ అనే కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్(ఐపీవో)లో పెట్టుబడులు పెట్టాలంటూ యాప్ ప్రతినిధుల పేరుతో బాధితుడికి ఫోన్లు వచ్చాయి. బాధితుడు దానికి ఒప్పుకోకపోవడంతో.. సెబీ నుంచి భారీ ఫెనాల్టీ పడుతుందని హెచ్చరించారు. ‘‘నా దగ్గర డబ్బుల్లేవు’’ అని చెబితే.. బజాజ్ క్యాపిటల్ నుంచి భారీగా లోన్ ఇప్పించి, ఇన్వెస్ట్ చేయించారు. లాభాలు కూడా భారీగా వచ్చినట్లు యాప్‌లో కనిపించడంతో.. బాధితుడు విత్‌డ్రా చేసుకునేందుకు యత్నించగా.. ఆ ఆప్షన్ కనిపించలేదు. యాప్ ప్రతినిధులకు కాల్ చేసినా.. స్పందన లేదు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News