Share News

Loksabha polls: బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. హరీష్ విమర్శ

ABN , Publish Date - May 10 , 2024 | 11:15 AM

Telangana: హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు పాల్గొని ప్రసంగించారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్‌కు చాలా ఇష్టమని.. సెంటిమెంట్ ఉన్న ప్రాంతమని అన్నారు. వికాసం కావాలంటే వినోద్ అన్న గెలువాలని.. విధ్యంసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ గెలవాలంటూ వ్యాఖ్యలు చేశారు.

Loksabha polls: బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. హరీష్ విమర్శ
BRS MLA Harish Rao Criticizes BJP, Congress

సిద్దిపేట, మే 10: హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ (BRS MP Candidate Boinapalli Vinod kumar) కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు (Former Minister Harish Rao) పాల్గొని ప్రసంగించారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్‌కు చాలా ఇష్టమని.. సెంటిమెంట్ ఉన్న ప్రాంతమని అన్నారు. వికాసం కావాలంటే వినోద్ అన్న గెలువాలని.. విధ్యంసం కావాలంటే కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) గెలవాలంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బడా బడా కార్పొరేట్ సంస్థల గురించి ఆలోచించిందని.. రూ.14 లక్షల కోట్లు మాఫీ చేసిందని.. పేదలకు ఒక్క రూపాయి మాఫీ చేయలేదని విమర్శించారు.

AP Elections: చివరి రెండు రోజులు.. ఎవరి వ్యూహాలు వారివి..!


బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ అని.. రైతుల ఉసురు పోసుకుందని మండిపడ్డారు. బీజేపీ పంచిన బొమ్మలను ఇంట్లో చూసి ఓటు వేస్తే కడుపు నిండుతుందా?, పిల్లలు బ్రతుకుతారా అని ప్రశ్నించారు. అయోధ్య రామాలయం బీజేపీ కట్టిందా? ట్రస్ట్ కట్టిందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి తాను కూడా రూ.2 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. నిన్న హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ సభ తుస్సుమందని.. 30 వేల కుర్చీలు వేస్తే 3 వేల మంది రాలేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఓటు అడిగితే మహాలక్ష్మి పథకం ఐదు నెలలు కలిపి రూ.12,500 ఇచ్చినాకనే ఓటు వేస్తామని అక్క చెల్లెల్లు చెప్పాలని అన్నారు.

AP Election 2024 : విజన్ X విధ్వంసం.. చంద్రబాబు, జగన్‌కు తేడా ఇదే


ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) గెలిచాక ఇస్తామని హామీ ఇచ్చిన మెడికల్ కాలేజ్ హుస్నాబాద్‌కు వచ్చిందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతున్నారని.. ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ అంటూ వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) బొమ్మలు పంచి ఓట్లు వేయమంటున్నారని.. బండి సంజయ్‌కు ఓటు వేస్తే అంత ఉత్తది అయిపోతుందన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్‌లో ఉందని. అది గెలిచే ప్రసక్తే లేదని హరీష్‌రావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

TS News: మా నాన్నని బతికించండి..

Hyderabad: మోదీ పాలనపై ప్రజలకు విశ్వాసం ఉంది..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2024 | 11:40 AM