Diwali: దీపావళి కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం తీపికబురు
ABN , Publish Date - Oct 19 , 2024 | 12:02 PM
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) దీపావళి సమయంలో తీపి కబురు చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 3 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించారు.
- 3 శాతం కరవుభత్యం
- జూలై 1 నుంచి వర్తింపు
చెన్నై: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) దీపావళి సమయంలో తీపి కబురు చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 3 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పెంచిన డీఏని జూలై ఒకటో తేదీ నుంచే వర్తింపజేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులు 50 శాతం చొప్పున కరవుభత్యం పొందుతున్నారని, 3 శాతం పెంపుతో కరవుభత్యం 53 శాతానికి పెరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Supreme Court : బాల్యవివాహం సామాజిక దురాచారం
ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు జూలై ఒకటి నుంచి కరవు భత్యాన్ని పెంచాలంటూ తనకు పలుమార్లు విజ్ఞప్తి చేశారని, ఆ విషయంపై ఆర్థిక శాఖ అధికారులతో చర్చించిన మీదట కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగానే 3 శాతం కరవుభత్యాన్ని పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కరవుభత్యం పెంపువల్ల 16 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కుటుంబ పింఛనుదారులు లబ్దిపొందనున్నారని తెలిపారు. ఈ డీఏ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1931 కోట్ల మేర అదనపు వ్యయభారం పడుతుందని, అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని స్టాలిన్ ఆ ప్రకటనలో తెలిపారు.
...................................................................
ఈ వార్తను కూడా చదవండి:
......................................................................
Actress Gayathri: నటి గాయత్రి సంచలన కామెంట్స్.. ఆ నలుగురూ తోడు దొంగలు
- డీఎంకే, బీజేపీ, శశికళ, ఓపీఎస్‌పై నటి గాయత్రి ధ్వజం
- అన్నామలై పరారైన నేత అంటూ వ్యాఖ్యలు
చెన్నై: అన్నాడీఎంకేను ఏదో రూపంలో విచ్ఛిన్నం చేయాలని డీఎంకే, బీజేపీ, శశికళ, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం కుట్ర పన్నారని, ఇందుకోసం వారంతా శతవిధాలా ప్రయత్నిస్తున్నారని సినీ నటి, అన్నాడీఎంకే మహిళా నేత గాయత్రి రఘురాం(Gayatri Raghuram) సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే 53వ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని, అన్నాడీఎంకే ఎంజీఆర్ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ ఆధ్వర్వంలో క్యారమ్‌బోర్డు ఫైనల్ పోటీలను శుక్రవారం టి.నగర్‌లో నిర్వహించారు.
ఈ వార్తను కూడా చదవండి: పన్నూ హత్యకు భారతీయుల కుట్ర
ఈ పోటీ విజేతలకు నటి గాయత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... అన్నాడీఎంకేను విచ్ఛిన్నం చేయాలని, ఏదో ఒక రూపంలో పార్టీని చీల్చాలని నాలుగు దుష్ట శక్తులు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇందుకోసం డీఎంకే, బీజేపీ, పన్నీర్‌సెల్వం, శశికళ ఒప్పందంతో పనిచేస్తున్నారన్నారు. కానీ, వారి కుట్రలు ఏమాత్రం ఫలించబోవన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) నేతృత్వంలో అన్నాడీఎంకే ఎంతో పటిష్టంగా ఉందన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై తన దృష్టిలో నాయకుడే కాదన్నారు. పారిపోయిన వ్యక్తి గురించి తన వద్ద ప్రస్తావించవద్దని మీడియాకు సూచించారు. 2026లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోదని, ఈ విషయాన్ని తమ పార్టీ నేత ఈపీఎస్ ఇప్పటికే తేటతెల్లం చేశారన్నారు. 2026లో తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆమె జోస్యం చెప్పారు. కేవలం రెండు మూడు గంటలు కురిసిన వర్షానికే చెన్నై నగరం నీట మునిగిందని ఆరోపించారు. వర్షపునీటి కాల్వల నిర్మాణం కోసం కేటాయించిన రూ.4 వేల కోట్లు ఎక్కడికి వెళ్ళాయని ఆమె ప్రశ్నించారు.
వర్షపు నీరు నిల్వలేని ప్రాంతాల్లో సీఎం, డిప్యూటీ సీఎంలు పర్యటించి, ఫొటోలు తీసి వాటిని షేర్ చేయడం కాదదని, టీవీల్లో చూపించే ప్రాంతాల్లో పర్యటించాలని ఆమె సూచించారు. నగరం జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయంపై ప్రశ్నించిన తమ పార్టీ అగ్రనేత ఎడప్పాడిని క్షేత్ర పర్యటనకు రావాలని ఆహ్వానించడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే, ఎడప్పాడి లేకుండా డీఎంకే నేతలు ఏమీ చేయలేరా అని గాయత్రి రఘురాం ప్రశ్నించారు.
ఇదికూడా చదవండి: Cyberabad police: ఆర్‌జే శేఖర్ బాషా అరెస్టు..
ఇదికూడా చదవండి: High Court: ఫోన్ ట్యాపింగ్ నిందితుడు రాధాకిషన్‌రావు
ఇదికూడా చదవండి: Bhupalpally: సింగరేణి ఓసీపీలతో దినదిన గండం!
ఇదికూడా చదవండి: Tummala: సోనియా పుట్టిన రోజు నాటికి రుణమాఫీ పూర్తి
Read Latest Telangana News and National News