Share News

Ram Mandir: రామ మందిర్ ప్రాతిష్టాపన.. ఎక్కడెక్కడ సెలవులు..?

ABN , Publish Date - Jan 21 , 2024 | 05:27 PM

రేపు (జనవరి 22న) అయోధ్యలో రామ మందిర్(Ram Mandir) ప్రాతిష్టాపన కార్యక్రమం గ్రాండ్‌గా జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు చోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించగా..మరికొన్ని చోట్ల కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు.

Ram Mandir: రామ మందిర్ ప్రాతిష్టాపన.. ఎక్కడెక్కడ సెలవులు..?

రేపు (జనవరి 22న) అయోధ్యలో రామ మందిర్(Ram Mandir) ప్రాతిష్టాపన కార్యక్రమం గ్రాండ్‌గా జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు చోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించగా..మరికొన్ని చోట్ల కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు. అయితే ఏ రాష్ట్రాల్లో పూర్తిగా సెలువులు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం. ఇక జనవరి 22న పబ్లిక్ హాలిడే నోటీసును జారీ చేసిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి.


జనవరి 22న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవును కూడా కేంద్రం ప్రకటించింది. ఉద్యోగులు వేడుకల్లో పాల్గొనేలా చేయడానికి ఈ మేరకు నిర్ణయించారు. అయితే ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జనవరి 22న తమ సిబ్బందికి హాఫ్‌డేగా ప్రకటించి ఆ తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మరోవైపు త్రిపుర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, అస్సాం, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రభుత్వ కార్యాలయాలు వారి విద్యా సంస్థలకు హాఫ్ డే సెలవు ఇచ్చాయి.

ఇదిలా ఉండగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర, గోవా, మహారాష్ట్రతో సహా మరికొన్ని రాష్ట్రాలు జనవరి 22న ‘డ్రై డే’గా ప్రకటించాయి. ఈ పవిత్రోత్సవం రోజున మద్యం లేదా మాంసాహారం అందించే దుకాణాలు మూసివేయబడతాయని వెల్లడించారు.

Updated Date - Jan 21 , 2024 | 05:50 PM