IOCL Refinery Blast: ఐఓసీఎల్ రిఫైనరీలో భారీ పేలుడు...పెద్దఎత్తున మంటలు
ABN , Publish Date - Nov 11 , 2024 | 07:54 PM
పెద్ద ఎత్తున పేలుడు, మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల కంపెనీలు, ప్రజలు భయందోళనలకు గురయ్యారు. మంటలు ఎగసిపడటంతో వెంటనే రిఫైనరీలోని కార్మికులను సురక్షింతంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
అహ్మదాబాద్: గుజరాత్ (Gujarat)లోని వడోదరలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)కు చెందిన రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం మధ్యాహ్నం 3.50 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రిఫైనరీలోని స్టోరేజ్ ట్యాంకులో ఈ పేలుడు జరిగింది. దీంతో రిఫైనరీ నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగి దట్టమైన పొగలు కిలోమీటర్ల మేరకు వ్యాపించాయి. సమాచారం తెలిసిన వెంటనే 10 ఫైర్ ఇంజన్లు హుటాహుటిన రప్పించి మంటలను అదుపు చేశారు.
Manipur: సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై దాడి... 11 మంది కుకీ మిలిటెంట్ల కాల్చివేత
పెద్ద ఎత్తున పేలుడు, మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల కంపెనీలు, ప్రజలు భయందోళనలకు గురయ్యారు. మంటలు ఎగసిపడటంతో వెంటనే రిఫైనరీలోని కార్మికులను సురక్షింతంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పేలుడుకు కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. ఏ మేరకు నష్టం జరిగి ఉండవచ్చనేది అంచనా వేస్తున్నారు.
కాగా, 2005లోనూ వడోదరలోని ఐఓసీఎల్‌లో ఇదే తరహాలో మంటలు చెలరేగి 13 మంది గాయపడ్డారు. అయితే ఆ తర్వాత నష్టం అంచనాలు, ఘటనకు కారణాలు స్పష్టం కాలేదు. ఆ ఘటనతో ఐఓసీఎల్ ఫెసిలిటీలో సేఫ్టీ ప్రోటోకాల్, మెయింటెనెన్స్‌పై అనుమానాలు తలెత్తాయి.
ఇవి కూడా చదవండి..
Yamuna River Pollution: కాలుష్య విషనురుగు కక్కిన యుమున నది ... ఆందోళనలో ప్రజలు
Justice sanjiv Khanna: సంచలన తీర్పులకు కేరాఫ్.. సుప్రీం కొత్త సీజేఐ ట్రాక్ రికార్డ్ ఇదీ
For National news And Telugu News