Share News

National Aerospace Laboratories : శత్రు విధ్వంసక ఆత్మాహుతి డ్రోన్‌

ABN , Publish Date - Aug 17 , 2024 | 04:44 AM

శత్రుదేశాల గుండెల్లో గుబులు పుట్టించగల స్వీయ విధ్వంసక డ్రోన్‌ను ‘నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌’ (ఎన్‌ఏఎల్‌) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. 30 హెచ్‌పీ సామర్థ్యం గల ఇంజిన్‌తో కూడిన ఈ డ్రోన్‌ వెయ్యి కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు.

 National Aerospace Laboratories :  శత్రు విధ్వంసక ఆత్మాహుతి డ్రోన్‌

  • వెయ్యి కి.మీ. రేంజ్‌.. 40 కిలోల బాంబులు మోసుకెళ్లే సామర్థ్యం

  • లక్ష్యాన్ని చేరుకోగానే పేలిపోయి భారీ విధ్వంసం

  • స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎన్‌ఏఎల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 16: శత్రుదేశాల గుండెల్లో గుబులు పుట్టించగల స్వీయ విధ్వంసక డ్రోన్‌ను ‘నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌’ (ఎన్‌ఏఎల్‌) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. 30 హెచ్‌పీ సామర్థ్యం గల ఇంజిన్‌తో కూడిన ఈ డ్రోన్‌ వెయ్యి కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. దాదాపు 40 కిలోల బరువైన పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలుగుతుంది.

కమాండ్‌ సెంటర్‌ నుంచి నియంత్రించగలిగేఈ మానవ రహిత డ్రోన్‌.. లక్ష్యం వద్దకు చేరుకోగానే పేలిపోయి లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. శత్రువుల రాడార్లకు, రక్షణ వ్యవస్థలకు దొరకకుండా ఈ డ్రోన్‌ను ప్రయోగించటానికి వీలవుతుంది. అంతేకాదు, జీపీఎస్‌ సంకేతాలను శత్రువులు అడ్డుకుంటే కూడా దీనిని నడపవచ్చు. ఇస్రో అభివృద్ధి చేసిన నావిక్‌ నావిగేషన్‌ సిస్టమ్‌ ద్వారా డ్రోన్‌ను ఆపరేట్‌ చేయవచ్చు. ఎన్‌ఏఎల్‌ డ్రోన్‌ను దేశీయ కామకాజీగా వ్యవహరిస్తున్నారు. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌ వాయుసేనకు చెందిన ఒక ఆత్మాహుతి దళాన్ని కామకాజీగా పిలిచేవారు. ఈ దళంలోని పైలట్లు పేలుడు పదార్థాలతో నింపిన విమానాలను శత్రువుల నౌకలు, సైన్యాలపైకి తీసుకెళ్లి ఢీకొట్టేవారు.

Updated Date - Aug 17 , 2024 | 04:44 AM