Modi-Rahul Gandhi: మోదీ, అమిత్‌షాతో రాహుల్-ఖర్గే భేటీ.. ఎందుకంటే?
ABN , Publish Date - Dec 18 , 2024 | 03:08 PM
ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్‌ను ఎంపిక చేసే కమిటీలో మోదీ, అమిత్‌షా, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు సభ్యులుగా ఉన్నారు.
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను ప్రస్తవిస్తూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీ, హోం మంత్రి అమిత్‌షాలతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నియామకం విషయమై ఈ భేటీ జరిగింది. ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్‌ను ఎంపిక చేసే కమిటీలో మోదీ, అమిత్‌షా, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు సభ్యులుగా ఉన్నారు.
2029 నుంచే జమిలి ప్రక్రియ?
కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలకమైన 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టడం, భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ప్రత్యేక చర్చ అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. పలుమార్లు ఉభయసభలు వాయిదా పడుతూ వచ్చాయి. రాజ్యాంగంపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. డాక్టర్ అంబేడ్కర్ పేరును పదేపదే వల్లెవేస్తుండంటం కాంగ్రెస్ 'ఫ్యాషన్'గా మారిందంటూ అమిత్‌షా వ్యాఖ్యానించారు. అమిత్‌షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ కన్నెర్ర చేసింది. అమిత్‌షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటు వెలుపల అంబేడ్కర్ ఫోటోలతో బుధవారంనాడు నిరసన తెలిపారు.
అమిత్‌షా నిజమే చెప్పారు: మోదీ
కాగా, పార్లమెంటులో అమిత్‌షా మాట్లాడిన వీడియోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ షేర్ చేస్తూ బుధవారం ఒక ట్వీట్ చేశారు. అమిత్‌షా కాంగ్రెస్ చీకటి చరిత్రను బయటపెట్టారని, ఆయన మాట్లాడిన వాస్తవాలను చూసి వాళ్లు ఉలిక్కిపడటంతో కొత్త నాటకాలు ఆడుతున్నారని, ప్రజలకు మాత్రం నిజం తెలుసునని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్‌కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలను కించపరచేందుకు రాజవంశం నేతృత్వంలోని ఓ పార్టీ చేసిన ప్రయత్నాలు దేశ ప్రజలందరికీ తెలుసునని గాంధీ ఫ్యామిలీని పరోక్షంగా తప్పుపట్టారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేయడం, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన వంటివి ఈతరహాలోనివేనని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Jammu and Kashmir: ఊపిరందక ఆరుగురి మృతి.. నలుగురికి తీవ్రగాయాలు
Rahul Gandhi:ఆల్‌టైం హైకి వాణిజ్య లోటు.. కేంద్రంపై రాహుల్ ఫైర్
For National News And Telugu News