Share News

Rohingyas in Delhi: రోహింగ్యాలపై కేజ్రీ, కేంద్ర మంత్రి లడాయి

ABN , Publish Date - Dec 30 , 2024 | 07:11 PM

అరవింద్ కేజ్రీవాల్ 'అబద్ధాల కోరు' అని, పదేపదే అబద్ధాలు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదని హర్దీప్ సింగ్ పురి తాజాగా కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు.

Rohingyas in Delhi: రోహింగ్యాలపై కేజ్రీ, కేంద్ర మంత్రి లడాయి

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ దేశ రాజధానిలో రోహింగ్యాల (Rohingyas) అంశం ముదురుతోంది. మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అరవింద్ కేజ్రీవాల్ 'అబద్ధాల కోరు' అని, పదేపదే అబద్ధాలు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదని హర్దీప్ సింగ్ పురి తాజాగా కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. హర్దీప్ సింగ్ పురి వద్ద రోహింగ్యాలు ఎక్కడ సెటిల్ అయ్యారు, ఎలా సెటిల్ అయ్యారనే డాటా ఉందని, ఆయనను అరెస్టు చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేసిన నేపథ్యంలో హర్దీప్ సింగ్ పురి తాజా వ్యాఖ్యలు చేశారు.

Akhilesh Yadav: యోగి అధికారిక నివాసం కింద 'శివలింగం'


''అబద్ధాల వెలుగులకు మంచు కరిగిపోదు. నిజం చెక్కుచెదరదు. పదేపదే అబద్ధాలు చెప్పినంత మాత్రాన్ని అది నిజం అయిపోదు. మీరు పచ్చి అబద్ధాలకోరు. నిజం ఏమిటంటే.. రోహింగ్యాలకు ఇప్పటి వరకూ ఎక్కడా కూడా ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లు లేవు'' అని హర్దీప్ సింగ్ పురి ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఎమ్మెల్యేలే వాళ్లను (రోహింగ్యాలు) ఢిల్లీలో సెటిల్ చేసి ఓటర్ కార్డులు, ఉచిత రేషన్, నీళ్లు, విద్యుత్‌తో పాటు ఒక్కొక్కరికి రూ.10,000 ఇచ్చారని ఆయన ప్రత్యారోపణలు చేశారు.


రోహింగ్యాలు ఎవరికి ఓటు వేస్తారో యావద్దేశానికి తెలుసునని కేంద్ర మంత్రి అన్నారు. ''రోహింగ్యాలను మేమే (బీజేపీ) తెచ్చామని అరవింద్ కేజ్రీవాల్, ఆప్ చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోవాళ్లు బీజేపీకి ఓటు వేస్తారని అనుకుంటున్నారా? ఓట్ల కోసం వాళ్లను (రోహింగ్యాలను) ఇక్కడ స్థిరపడేలా చేసిందే ఆమ్ ఆద్మీ పార్టీ. అలాంటి వాళ్ల పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తేనే ప్రజాస్వామ్యానికి మంచిది'' అని హర్దీప్ సింగ్ పురి వ్యాఖ్యానించారు. రోహింగ్యాలకు మద్దతు కొనసాగించడం ద్వారా దేశ భద్రతతో కేజ్రీవాల్ ఆలటాలడుతున్నారని దుయ్యపట్టారు. ఏ ఆధారంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వివరిస్తూ హోం మంత్రిత్వ శాఖ, తాను వివరణ ఇచ్చామని, అది కూడా పబ్లిక్ డొమైన్‌లో తెలియజేశాయమని అన్నారు. అయినప్పటికీ సిగ్గువిడిచి మరీ అబద్ధాలు ప్రచారం చేస్తుండటం చూస్తే రాజకీయాలు ఎంత హీనస్థితికి దిగజారుస్తున్నారో అర్ధమవుతుందని, ఇప్పటికైనా అబద్ధాలు మానుకోవాలని ఆప్‌కు ఆయన హితవు పలికారు.


ఇవి కూడా చదవండి:

Prashant Kishore: పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన.. కీలక నేత అరెస్ట్

Kumbh Mela 2025: మహా కుంభమేళాకు.. రూ.7,500 కోట్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 30 , 2024 | 07:14 PM