Maharashtra Elections: లక్షల మంది ఫాలవోర్లు.. ఎమ్‌ఎల్‌ఏగా పోటీ చేయగా.. తెలుగు సినిమా విలన్‌కు ఇలా జరిగిందేంటీ..
ABN , Publish Date - Nov 23 , 2024 | 06:23 PM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు సినిమా విలన్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ వ్యక్తి అనేక తెలుగు సినిమాల్లో విలన్‌గా నటించాడు. ఇన్‌స్టాలో ఏకంగా 5.6 మిలియన్ ఫాలోవర్లు కూడా ఉన్నారు. అంతేకాకుండా బిగ్ బాస్ షోలో పాల్గొని ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అయినా ఆ సెలబ్రిటీకి మాత్రం..
Maharashtra Elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు సినిమా విలన్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ వ్యక్తి అనేక తెలుగు సినిమాల్లో విలన్‌గా నటించాడు. ఇన్‌స్టాలో ఏకంగా 5.6 మిలియన్ ఫాలోవర్లు కూడా ఉన్నారు. అంతేకాకుండా బిగ్ బాస్ షోలో పాల్గొని ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అయినా ఆ సెలబ్రిటీకి మాత్రం మహారాష్ట్ర ఓటర్లు షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
దూకుడు, బాద్‌షా, టెంపర్, హార్ట్ఎటాక్ తదితర తెలుగు సినిమాల్లో విలన్‌గా (Telugu movie villain) నటించిన అజాజ్ ఖాన్‌కు (Ajaz Khan) ఇన్‌స్టాగ్రామ్‌లో 5.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అలాగే బిగ్ బాస్ షోతో కూడా అమితమైన పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకుని ఎలాగైనా ఎమ్‌ఎల్‌ఏగా గెలవాలని.. వెర్సోవా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) తరఫున పోటీ చేయగా దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో అజాజ్ ఖాన్‌కు కేవలం 155 ఓట్లు మాత్రమే దక్కాయి. అంత పాపులారిటీ ఉన్న ఇతడికి ఇంత ఘోరంగా ఓట్లు రావడంతో ఈ అంశం ప్రస్తుతం మహారాష్ట్రలో హాట్‌టాపిక్‌గా మారింది.
ఈ నియోజకవర్గం నుంచి శివసేన అభ్యర్థి హరూన్ ఖాన్ 65వేలకు పైగా ఓట్లతో ఘన విజయం సాధించగా.. 63వే పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి డాక్టర్ భారతి లావేకర్ రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ నోటాకు 1298 ఓట్లు రాగా.. అజాజ్ ఖాన్‌కు నోటా కంటే తక్కువ రావడం కొసమెరుపు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఫాలోయింగ్చ, క్రేజ్ ఉంది కదా అని విర్రవీగితే చివరకు ఇలాంటి ఫలితమే దక్కుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఫాలోవర్స్ మొత్తం ఓట్లుగా మారతానుకుంటే పొరపాటే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.