All Party Meet: చివరి సెషన్‌కు సహకరించండి విపక్షాలకు కేంద్రం విజ్ఞప్తి
ABN , Publish Date - Jan 30 , 2024 | 10:53 AM
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్ నేపథ్యంలో ఢిల్లీలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఉదయం 11.30 గంటలకు సమావేశానికి హాజరుకావాలని లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తోన్న అన్ని పార్టీల నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది.
ఢిల్లీ: ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కోసం ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు (Parliament Session) ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత లోక్ సభకు ఇవే చివరి సమావేశాలు. ఏప్రిల్- మే నెలలో సార్వత్రిక ఎన్నికల జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి బడ్జెట్ ప్రతిపాదిస్తారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్ నేపథ్యంలో ఢిల్లీలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఉదయం 11.30 గంటలకు సమావేశానికి హాజరుకావాలని లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తోన్న అన్ని పార్టీల నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. చివరి బడ్జెట్ సెషన్ కావడంతో పార్లమెంట్ సమావేశాలు మంచి వాతావరణంలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కీలక బిల్లులు గత సమావేశాల్లో ఆమోదం పొందాయి. ప్రస్తుత సమావేశాల్లో ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌తోపాటు 19 బిల్లులు ఆమోదించుకోవాలని భావిస్తోంది. భద్రతా ఏర్పాట్ల గురించి అన్ని పార్టీలకు కేంద్ర ప్రభుత్వం వివరించనుంది. సభా సజావుగా జరిగేలా సహకరించాలని ప్రతిపక్షాలను కేంద్ర ప్రభుత్వం కోరనుంది.
మరిన్ని బడ్జెట్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.