Congress : ఆయన సర్వాంతర్యామి.. ఆధిపత్యం చేయాలనుకోవడం మీ అవివేకం..
ABN , Publish Date - Apr 02 , 2024 | 03:05 PM
లోక్ సభ ఎన్నికల వేళ అధికార బీజేపీపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. రాజకీయ నేతలు చేస్తున్న కామెంట్లతో రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా కాంగ్రెస్ ( Congress ) నేత సచిల్ పైలట్ బీజేపీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు.
లోక్ సభ ఎన్నికల వేళ అధికార బీజేపీపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. రాజకీయ నేతలు చేస్తున్న కామెంట్లతో రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా కాంగ్రెస్ ( Congress ) నేత సచిల్ పైలట్ బీజేపీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. రాముడు, హిందూమతాన్ని అడ్డం పెట్టుకుని కమలం పార్టీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. రాముడు అందరి వాడని, ఎంత ప్రయత్నించినా ఆయనపై, హిందూమతంపై బీజేపీ ఆధిపత్యం దక్కించుకోలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి ప్రజల భావోద్వేగాల గురించి కాకుండా వారి సమస్యల పరిష్కారంపై మాట్లాడుతుందని వివరించారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
India - China: మీ ఇంటి పేరు మార్చితే అది నాది అవుతుందా.. చైనాకు జై శంకర్ కౌంటర్..
మతం, హిందూ-ముస్లిం, మందిర్-మసీద్ సమస్యలను ఆధారంగా చేసుకుని రూపొందించే ఎజెండాను దేశ ఓటర్లు అంగీకరించరని సచిన్ పైలట్ అన్నారు. ఆర్థిక విధానం, ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం తగ్గించడం, రైతులకు మంచి భవిష్యత్తును అందించడం వంటి సమస్యలను పరిష్కరించే ఎజెండాను మాత్రమే స్వాగతిస్తారన్నారు. సుప్రీం కోర్టు తీర్పునకు కట్టుబడి అయోధ్యలో రామ మందిరం నిర్మించారని తెలిపారు. ఎప్పుడు ఏమి జరగాలో సుప్రీం కోర్టు నిర్ణయిస్తుందని వివరించారు.
BJP-AAP: బీజేపీలో చేరకుంటే నన్నూ అరెస్టు చేస్తారు.. కాక రేపుతున్న అతిశీ కామెంట్స్..
"అయోధ్య రామాలయం ఒకే పార్టీ చేతుల మీద జరగలేదు. కోర్టు తుది తీర్పును అందరూ ప్రశంసించారు. ఆలయ నిర్మాణాన్ని మేమంతా స్వాగతించాం. మందిర నిర్మాణాన్ని బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకుంది. ప్రజల భావోద్వేగాలను ప్రేరేపించింది. ఇండియా కూటమి చాలా బలంగా ఉంది. రాబోయే ఐదేళ్లలో భారతదేశ భవిష్యత్తు కోసం బ్లూప్రింట్ అందిస్తాం. ఎన్నికలు నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరగాలి."
- సచిన్ పైలట్, కాంగ్రెస్ నేత
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.