Share News

ఈపీఎఫ్‌వోలో 21 వేలకు వేతన పరిమితి!

ABN , Publish Date - Nov 12 , 2024 | 04:38 AM

కేంద్ర ప్రభుత్వం త్వరలో వేతన జీవులకు శుభవార్త చెప్పనుందా? ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వోలో) పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచనుందా? ఈ ప్రశ్నలకు విశ్వసనీయవర్గాలు ఔననే చెబుతున్నట్లు జాతీయ వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి.

ఈపీఎఫ్‌వోలో 21 వేలకు వేతన పరిమితి!

న్యూఢిల్లీ, నవంబరు 11: కేంద్ర ప్రభుత్వం త్వరలో వేతన జీవులకు శుభవార్త చెప్పనుందా? ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వోలో ) పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచనుందా? ఈ ప్రశ్నలకు విశ్వసనీయవర్గాలు ఔననే చెబుతున్నట్లు జాతీయ వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. దీంతోపాటు.. ఉద్యోగుల సంఖ్యను బట్టి కంపెనీల నమోదు విధానం కొనసాగుతుండగా.. ఆ సంఖ్య పరిమితిని తగ్గించనున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అంటే.. ప్రస్తుతం ఉన్న 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీలు ఈపీఎ్‌ఫవోలో చేరడం తప్పనిసరి. ఈ సంఖ్యను 10-15కు తగ్గించే అవకాశాలున్నాయి. మరోవైపు ఈపీఎ్‌ఫవో వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతోపాటు.. ప్రైవేటు రంగంపైనా భారం పడుతోందని.. అయితే, ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యనిధికి ఉద్యోగి, యజమాని చెరో 12% వాటాను చెల్లించగా.. యజమాని వాటా నుంచి 8.33% పింఛను పథకానికి.. మిగతాది ఈపీఎఫ్‌వోలో జమ అవుతుంది. 2014లో చివరిసారి వేతన పరిమితిని సవరించారు.

Updated Date - Nov 12 , 2024 | 04:38 AM