Share News

Viral Video: వామ్మో.. ఉష్ణోగ్రతలు మైనస్ 51 డిగ్రీలకు పడిపోతే ఇలా ఉంటుందా.. ఈ జంతువుల పరిస్థితి చూస్తే..

ABN , Publish Date - Aug 22 , 2024 | 09:06 PM

మన ప్రాంతాల్లో చలికాలంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడితేనే ఆ చలిని భరించలేం. అలాంటిది ఇక మంచు ప్రదేశాల్లో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేంకగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు జీరోకు పడిపోవడం చూస్తుంటాం. అలాంటి సమయాల్లో...

Viral Video: వామ్మో.. ఉష్ణోగ్రతలు మైనస్ 51 డిగ్రీలకు పడిపోతే ఇలా ఉంటుందా.. ఈ జంతువుల పరిస్థితి చూస్తే..

మన ప్రాంతాల్లో చలికాలంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడితేనే ఆ చలిని భరించలేం. అలాంటిది ఇక మంచు ప్రదేశాల్లో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేంకగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు జీరోకు పడిపోవడం చూస్తుంటాం. అలాంటి సమయాల్లో ఇళ్లు, వాహనాలు, రోడ్లు.. ఇలా ఎక్కడ చూసినా మంచు కూరుకుపోతుంటుంది. అయితే అదే ఉష్ణోగ్రతలు మైనస్ 51 డిగ్రీలకు పడిపోతే ఇంకెలా ఉంటుంది. ఊహకు కూడా అందడం లేదు కదా.. అలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. క్షణాల్లో గడ్డకట్టుకుపోయే అలాంటి చలిలో జంతువుల పరిస్థితి చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) చక్కర్లు కొడుతోంది. మూడేళ్ల కిందట కజకిస్థాన్‌లో (Kazakhstan) చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ 51 డిగ్రీలకు పడిపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రధానంగా అడవిలోని జంతువుల పరిస్థితి దయనీయంగా మారింది.

Viral Video: వామ్మో.. బాహుబలిని మించిపోయాడుగా.. అంతా బైకును డ్రైవ్ చేస్తే.. ఇతను మాత్రం ఏకంగా..


ఎక్కడ నిలబడ్డ జంతువులు.. అక్కడే గడ్డకట్టుకుపోయాయి. ఇలా కనుచూపు మేరలోని జంతువులన్నీ చనిపోయి.. (Animals frozen in the cold) అలాగే గడ్డకట్టుకుపోయాయి. ఈ సీన్ చూసిన వారికి ఎవరో విగ్రహాలను నిలబెట్టినట్లుగా అనిపిస్తుంది. తీరా దగ్గరికి వెళ్లి చూడగా.. చాలా జంతువులు ఇలా దయనీయమైన స్థితిలో ప్రాణాలు విడిచినట్లు అర్థమవుతుంది. ఈ చిత్రంలో ఓ కుక్కపై ఎలుక కూడా కనిపిస్తుంది. పరిస్థితి చూస్తుంటే.. చలికి తట్టుకోలేని ఎలుక ప్రాణాలను కాపాడుకునేందుకు కుక్క పైకి ఎక్కినట్లు అనిపిస్తుంది. కుక్కపై పడుకున్న ఎలుక.. అలాగే ప్రాణాలు విడిచి గడ్డకట్టుకుపోయింది.

Viral Video: వామ్మో.. గూజ్‌బమ్స్ తెప్పించే వీడియో.. నక్కను వేటాడిన డేగ.. చివరికి..


దీంతో పాటూ మరికొన్ని కుక్కలు, గొర్రెలు, జింకలు తదితర జంతువులు ఎక్కడివక్కడ విగ్రహాల తరహాలో కనిపిస్తుంటాయి. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ మరీ దారుణంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో.. పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఆకలితో ఉన్న మేకకు.. ఈ గేదె చేసిన సాయానికి.. దండం పెట్టాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 22 , 2024 | 09:06 PM