Share News

Viral: దేశం ఎప్పటికీ ఇంతే.. వీళ్లింక మారరు! ఇదిగో ప్రూఫ్!

ABN , Publish Date - Apr 18 , 2024 | 09:23 PM

రైల్వే పట్టాలపై చెత్త వేసింది చాలక అది తన హక్కన్నట్టు వాదించిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: దేశం ఎప్పటికీ ఇంతే.. వీళ్లింక మారరు! ఇదిగో ప్రూఫ్!

ఇంటర్నెట్ డెస్క్: రైల్వేలు, బస్ స్టాండ్‌ల వంటి ప్రభుత్వ ఆస్తులను శుభ్రంగా ఉంచాలని అధికారులు ఎంతగా మొత్తుకున్నా ప్రజల్లో మార్పు రావట్లేదు. పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఏమైనా చేయొచ్చనే ధోరణి ప్రజల్లో వేళ్లూనుకుంది. ఆ మాటకొస్తే అసలు పబ్లిక్ ప్లేస్‌లో వీలైనంత చెత్త వేయాలని భావించేవారు కూడా కోకొల్లలు. ఇందుకు తాజాగా ఉదాహరణ నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. వీడియో చూసిన వారందరూ నిరాశలో కూరుకుపోతున్నారు. వీళ్లను మార్చలేమంటూ చేతులెత్తేస్తున్నారు.

ముంబైలో వెలుగు చూసిన ఈ ఘటన తాలుకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. లోకల్ ట్రైన్ ప్రయాణికుడు తన ఎదురుగా కూర్చున్న ఓ వ్యక్తి దుశ్చర్యను వీడియోలో రికార్డు చేసి నెట్టింట షేర్ చేశాడు. ఇందులో కనిపించిన దాని ప్రకారం, ఓ ప్రయాణికుడు రైల్లో గుట్కా తినడం ప్రారంభించాడు. ఇందు కోసం తొలుత ప్యాకెట్ చించి గుట్కాను చేతిలో పెట్టుకున్న అతడు ఖాళీ ప్యాకెట్‌ను తీసి బయటపట్టాలపై పడేశాడు. ఇది తప్పుకాదా అని ఎదుటివ్యక్తి ప్రశ్నిస్తే క్షణకాలం పాటు బిత్తరపోయిన అతడు చివరకు తన అసలు బుద్ధిని బయటపెట్టాడు (Mumbai mans bizarre justification for littering station).

IndiGo: ‘ఇండిగో’ ఉప్మాపై హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్ కీలక కామెంట్స్.. వెంటనే స్పందించిన ఎయిర్ లైన్స్!


రైల్వే మెయింటెనెన్స్‌కు తాను డబ్బు చెల్లిస్తున్నానన్న అతడు చెత్త వేస్తే తప్పేమీ లేదనన్నట్టు మాట్లాడాడు. చెత్తవేయడం తన హక్కని కూడా దబాయించాడు. దీంతో, ఎదుటి వ్యక్తి చేసేదేం లేక సైలెంట్‌గా వీడియో రికార్డు చేసి నెట్టింట పోస్టు చేశాడు. ఘటనపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రైల్వే పరిసరాలను పాడు చేస్తున్న అతడికి గుణపాఠం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్లు ఎప్పటికీ మారరు దేశమింక ఇంతే అంటూ కొందరు నైరాశ్యం వ్యక్తం చేశారు. ఘటనపై రైల్ సేవ కూడా స్పందించింది. ఘటన జరిగిన రైలు బోగీ ఏదో నేరుగా మెసేజ్ చేసి చెప్పాలని వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని కోరింది. నేరుగా ఈమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయచ్చంటూ ఈమెయిల్ ఐడీని కూడా షేర్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 09:26 PM