Share News

Viral Video: పిల్ల సింహాల వేట ఇంత దారుణంగా ఉంటుందా.. గేదెను చుట్టుముట్టి మరీ.. చివరకు..

ABN , Publish Date - Nov 23 , 2024 | 04:16 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ అడవిలో పిల్ల సింహాలన్నీ కలిసి వేట కోసం ఎదురు చూస్తుంటాయి. ఆకలితో ఉన్న పిల్ల సింహాలకు దూరంగా ఓ గేదె కనిపిస్తుంది. దీంతో వెంటనే తమ టార్గెట్ ఫిక్స్ చేస్తాయి. ఆ వెంటనే అవన్నీ కలిసి గేదెను చుట్టుముడతాయి. వాటిలో ఓ సింహం..

Viral Video: పిల్ల సింహాల వేట ఇంత దారుణంగా ఉంటుందా.. గేదెను చుట్టుముట్టి మరీ.. చివరకు..

పేరుకు తగ్గట్టుగా సింహం మిగతా జంతువులపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటుంది. ఎలాంటి జంతువునైనా ఎంతో చాకచక్యంగా వేటాడుతుంటాయి. ఒక్కసారి తమ పంజా విసిరాయంటే అవతల ఎలాంటి జంతువున్నా సరే.. ఇట్టే వాటికి ఆహారమైపోవాల్సిందే. సింహం వేటకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, సింహం పిల్లల వేటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పిల్ల సింహాలన్నీ కలిసి ఓ గేదెను చుట్టుముట్టాయి. చివరకు దాన్ని ఎలా వేటాడాయో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అడవిలో పిల్ల సింహాలన్నీ కలిసి వేట కోసం ఎదురు చూస్తుంటాయి. ఆకలితో ఉన్న పిల్ల సింహాలకు దూరంగా ఓ గేదె కనిపిస్తుంది. దీంతో వెంటనే తమ టార్గెట్ ఫిక్స్ చేస్తాయి. ఆ వెంటనే అవన్నీ కలిసి గేదెను చుట్టుముడతాయి. వాటిలో ఓ సింహం ( lion cub attacked a buffalo) గేదె మీదకు దూకుతుంది. మెడ పట్టుకోకుండా ఏకంగా దాని వీపు పైభాగంలో కొరికేస్తుంది. దీంతో గేదె గట్టిగా అరుస్తూ తప్పించుకోవాలని చూస్తుంది.

Optical illusion: ఎంతో తెలివైన వారు మాత్రమే.. ఈ చిత్రంలో ఈ నావికుడి భార్యను 10 సెకన్లలో గుర్తించగలరు..


అయినా ఆ సింహం దాన్ని తన పంజాతో గట్టిగా పట్టుకుని వీపు భాగాన్ని మొత్తం కొరికేస్తుంది. ఇలా ఆ గేదె ప్రాణాలతో ఉండగానే దాని పైకి ఎక్కి తినేందుకు ప్రయతిస్తుంది. ఓ వైపు గేదె తప్పించుకోవాలని చూస్తుంటే.. మరోవైపు పిల్ల సింహాలు మాత్రం దాన్ని వదలకుండా మూకుమ్మడి దాడి చేస్తాయి. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: ప్రేమెంత పని చేసే నారాయణా.. మేకతో దోస్తీ.. చివరకు కుక్క పరిస్థితి ఇదీ..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహాలు వేటను సజీవంగా తినడం చాలా అరుదు’’.. అంటూ కొందరు, ‘‘సాయం కోసం అరుస్తున్న గేదెను చూస్తుంటే బాధగా ఉంది’’.. అంటూ మరికొందరు, ‘‘చూసేందుకు ఇది బాధకరంగా ఉన్నా కూడా ప్రకృతి ధర్మాన్ని ఎవరూ కాదనలేరు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5.59లక్షలకు పైగా లైక్‌లు, 36 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

ఇవి కూడా చదవండి..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Viral Video: లగేజీ బ్యాగ్‌ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 23 , 2024 | 04:16 PM