Share News

Viral Video: పాత సైకిల్‌ని ఇలాక్కూడా వాడొచ్చా.. ఈమె అతి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

ABN , Publish Date - May 03 , 2024 | 05:43 PM

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో వ్యూస్, లైక్‌ల కోసం కొందరు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు తమ ఇళ్లల్లోని పాత వస్తువులతో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు.. .

Viral Video:  పాత సైకిల్‌ని ఇలాక్కూడా వాడొచ్చా.. ఈమె అతి తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో వ్యూస్, లైక్‌ల కోసం కొందరు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు తమ ఇళ్లల్లోని పాత వస్తువులతో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు.. ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ పాత సైకిల్‌ను వాడిన విధానం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘పాత సైకిల్‌ని ఇలాక్కూడా వాడొచ్చా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) బట్టలు ఉతికేందుకు (clothes Washing) ఏదైనా వినూత్న పద్ధతిని ట్రై చేయాలని ఆలోచించింది. చివరకు ఆమెకు ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. ఐడియా రావడమే ఆలస్యం వెంటనే.. తన ఇంట్లో మూలన పడేసిన పాత సైకిల్‌ని (old bicycle) తీసుకొచ్చింది. ఓ ప్లాస్టిక్ బుట్టలో మాసిన దుస్తులను పడేసి, నీళ్లు పోసింది. సైకిల్ ఓ వైపు పెడల్ సరిగ్గా ప్లాస్టిక్ బుట్టలో ఉంచి పడుకోబెట్టాడు. మరో వైపు ఉన్న పెడల్‌ను తిప్పుతూ బట్టలను వాషింగ్ చేసిందన్నమాట.

Viral Video: ఈ తల్లి గొరిల్లా యాక్టింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. పిల్ల గొరిల్లా పదే పదే పిలుస్తున్నా..


మరో వైపు మురికి నీరు బయటికి పోతుంటే కొత్త నీరు వచ్చేలా ఓ పైపును కూడా ఏర్పాట చేసింది. ఇలా వాషింగ్ మెషిన్ తరహాలో బట్టలను ఉతికేందుకు పాత సైకిల్‌ను వాడడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అరెరే..! ఇన్నాళ్లూ ఇలాంటి ఐడియా మాకెందుకు రాలేదు’’.. అంటూ కొందరు, ‘‘మా ఇంట్లోనూ పాత సైకిల్ ఉంది.. ఇకపై మేము వాషింగ్ మెషిన్ కొనక్కర్లేదు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాక్కూడా బట్టలు ఉతకొచ్చా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 37 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మాంసం ముక్కలను కట్ చేస్తుండగా.. దిమ్మతిరిగే సీన్.. ఒక్కసారిగా వాటిలో ఒకటి..

Updated Date - May 03 , 2024 | 05:43 PM