Share News

Viral Video: ఏటీఎంలో డబ్బులు బయటికి రాగానే ఆనందం తట్టుకోలేక.. ఈ యువతి చేసిన నిర్వాకం చూడండి..

ABN , Publish Date - Oct 24 , 2024 | 10:58 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి నగదు తీసుకోవడానికి ఏటీఎం రూమ్‌లోకి వెళ్లింది. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా.. ఏటీఎం గదిలో ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఏటీఎం కార్డు మిషిన్‌లో పెట్టి...

Viral Video: ఏటీఎంలో డబ్బులు బయటికి రాగానే ఆనందం తట్టుకోలేక.. ఈ యువతి చేసిన నిర్వాకం చూడండి..

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో చాలా మంది ఏ పని చేసినా దాన్ని వీడియోగా మార్చి క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. అలాగే మరికొందరు చిత్ర విచిత్రమైన రీల్స్‌ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఓ అడుగు ముందుకేసి ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇంకొందరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి నిర్వాకానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏటీఎంలో నగదు బయటికి రాగానే యువతి ఆనందం తట్టుకోలేక విచిత్ర నిర్వాకానికి పాల్పడింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి నగదు తీసుకోవడానికి ఏటీఎం రూమ్‌లోకి వెళ్లింది. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా.. ఏటీఎం గదిలో ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఏటీఎం కార్డు మిషిన్‌లో పెట్టి, విత్‌డ్రా ప్రాసెస్ పూర్తి చేయగానే.. నగదు బయటకు వచ్చింది.

Viral Video: ఎలాంటి ఎక్స్‌పోజింగ్ లేకున్నా లక్షల్లో వ్యూస్.. ఇంతకీ ఈమె చేసిన పనేంటంటే..


ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. నగదు బయటికి రావడం చూసిన ఆమె.. సంతోషాన్ని (young woman dances in the ATM room) తట్టుకోలేక డాన్స్ చేసింది. చేతులను అటూ ఇటూ ఊపుతూ డాన్స్ చేయసాగింది. తర్వాత నగదును చేతిలోకి తీసుకుని మళ్లీ మళ్లీ డాన్స్ చేయసాగింది. ఇలా చాలా సేపు ఆమె ఏటీఎం గదిలో డాన్స్ చేస్తూనే ఉంది. చివరగా ఏటీఎం మిషిన్‌ ముందు తల వంచి దండం పెట్టి వెళ్లిపోతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: గేదే కదా ఏం చేస్తుందిలే అనుకున్నారు.. చివరకు దాని రియాక్షన్ చూసి ఖంగుతిన్నారు..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బ్యాంక్ అకౌంట్‌లో శాలరీ పడిందేమో’’.. అంటూ కొందరు, ‘‘ఈమె సంతోషం చూస్తుంటే నవ్వొస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 వేలకు పైగా లైక్‌లు, 3.41 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే అడవి జంతువులకు హడల్.. రైతు తెలివి మామూలుగా లేదుగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే అడవి జంతువులకు హడల్.. రైతు తెలివి మామూలుగా లేదుగా..

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 24 , 2024 | 11:44 AM