Virat Kohli: పదే పదే అదే తప్పు.. కోహ్లీ.. ఇక మారవా..
ABN , Publish Date - Dec 16 , 2024 | 09:48 AM
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతోంది. పెర్త్ టెస్ట్‌లో సెంచరీతో అదరగొట్టిన కింగ్.. ఆ తర్వాత మళ్లీ పాత బాటలోకి వచ్చేశాడు. పదే పదే ఒకే తప్పు చేస్తూ వికెట్ పారేసుకుంటున్నాడు.
IND vs AUS: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతోంది. పెర్త్ టెస్ట్‌లో సెంచరీతో అదరగొట్టిన కింగ్.. ఆ తర్వాత మళ్లీ పాత బాటలోకి వచ్చేశాడు. అడిలైడ్ టెస్ట్‌లో విఫలమైన విరాట్.. గబ్బా టెస్ట్‌లోనూ దారుణమైన ఆటతీరుతో నిరాశపర్చాడు. అయితే పరుగులు చేయకపోవడం కంటే కూడా కోహ్లీ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. పదే పదే ఒకే తప్పు చేస్తూ వికెట్ పారేసుకోవడం చర్చలకు దారితీసింది. విరాట్.. నువ్వు ఇక మారవా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ అతడు ఎలా ఔట్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..
రెచ్చగొట్టి మరీ..
సాధారణంగా చాలా మంది బ్యాటర్లు ఆఫ్ స్టంప్‌కు ఆవల పడి వెళ్తున్న బంతుల్ని వెంటాడి ఔట్ అవడం కామనే. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఈ బంతులకు ఔట్ అవడం ఓ హాబీగా మారిపోయింది. గబ్బా టెస్ట్‌లోనూ మరోసారి అదే తరహాలో అతడు ఔట్ అయ్యాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీస్‌తో షాట్లు కొట్టు చూద్దామంటూ కోహ్లీని టెంప్ట్ చేశాడు హేజల్‌వుడ్. అలాంటి బంతులకు కవర్ డ్రైవ్స్‌తో ఎన్నోమార్లు భారీగా పరుగులు రాబట్టాడు కింగ్.
వీక్‌నెస్‌పై కొట్టారు
ఆసీస్ వలలో పడిన కోహ్లీ.. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతుల్ని తనదైన స్టైల్‌లో ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ షాట్ కనెక్ట్ అవలేదు. బంతి అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. కావాలనే కోహ్లీని రెచ్చగొట్టి ఔట్ చేశాడు హేజల్‌వుడ్. విరాట్ మరింత ఓపికగా, కూల్‌గా ఆడి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తన వీక్‌నెస్ మీద కొడుతున్నారని తెలిసినా కావాలనే అటాక్‌కు వెళ్లడం, ఆఫ్ స్టంప్ డెలివరీస్ బలహీనత నుంచి బయటపడకపోవడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి.
Also Read:
పాక్‌పై భారత్ గెలుపు
‘ముస్తాక్ అలీ’ విజేత ముంబై
భారత్‌దే జూనియర్ హాకీ ఆసియా కప్
For More Sports And Telugu News