Share News

IND vs END: సచిన్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్

ABN , Publish Date - Jan 25 , 2024 | 02:12 PM

ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డును ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ బద్దలుకొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేసిన రూట్ 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ సచిన్ రికార్డును అధిగమించాడు.

IND vs END: సచిన్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డును ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ బద్దలుకొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేసిన రూట్ 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ సచిన్ రికార్డును అధిగమించాడు. భారత్, ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 2,535 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ అధిగమించాడు. ప్రస్తుతం రూట్ ఖాతాలో 2,555 పరుగులు ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ రికార్డును రూట్ సమం చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో టీమిండియాపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పాంటింగ్‌తో కలిసి సమంగా ఉన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో పాంటింగ్ కూడా టీమిండియాపై 2,555 పరుగులు చేశాడు. అయితే ఇందుకు పాంటింగ్ 51 ఇన్నింగ్స్‌లు ఆడగా.. రూట్ 47 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు.


ప్రస్తుతం వీరిద్దరు సమానంగా ఉన్నప్పటికీ మరొక పరుగు చేస్తే టీమిండియాపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. కాగా ఇదే టెస్ట్ మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో రూట్ ఈ రికార్డును చేరుకునే అవకాశాలున్నాయి. ఇక ఇదే మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ జోడి రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో టీమిండియాకు వీరిద్దరు కలిసి 500 వికెట్లను పూర్తి చేసుకున్నారు. దీంతో టీమిండియా తరఫున 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలింగ్ జోడిగా అశ్విన్, జడేజా చరిత్ర సృష్టించారు. అలాగే 501 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే- హర్బజన్ సింగ్ రికార్డును బద్దలుకొట్టారు. దీంతో ప్రస్తుతం 503 వికెట్లతో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలింగ్ జోడిగా అశ్విన్- జడేజా చరిత్ర సృష్టించారు. ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్టులో బెన్ డకెట్, ఓల్లీ పోప్, జాక్ క్రాలే, జో రూట్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ - జడేజా జోడి ఈ రికార్డు నెలకొల్పింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 25 , 2024 | 02:12 PM