IPL 2024: 21 మ్యాచ్‌లు, 10 వేదికలు.. తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ మ్యాచ్‌ల వివరాలివే!
ABN , Publish Date - Mar 20 , 2024 | 04:00 PM
ఐపీఎల్ 2024 వరకు రంగం సిద్ధమైంది. ఈ శుక్రవారం నుంచే మెగా లీగ్ ప్రారంభంకానుంది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఈ సారి ఐపీఎల్‌ను రెండు విడతలుగా నిర్వహిస్తున్నారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు మొదటి విడత పోటీలు జరగనున్నాయి.
ఐపీఎల్ 2024 వరకు రంగం సిద్ధమైంది. ఈ శుక్రవారం నుంచే మెగా లీగ్ ప్రారంభంకానుంది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఈ సారి ఐపీఎల్‌ను రెండు విడతలుగా నిర్వహిస్తున్నారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు మొదటి విడత పోటీలు జరగనున్నాయి. 17 రోజులపాటు జరగనున్న మొదటి విడత పోటీల్లో 21 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 4 రోజులు డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ 21 మ్యాచ్‌లను 10 వేదికల్లో నిర్వహించనున్నారు. ఈ నెల 22న చెన్నై వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఏప్రిల్ 7న లక్నో వేదికగా లక్నోసూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో తొలి దశ పోటీలు ముగియనున్నాయి. చెన్నై, బెంగళూరు మధ్య జరిగే ఆరంభ మ్యాచ్ మినహా మిగతావి అన్నీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్నాయి. చెన్నై, బెంగళూరు మ్యాచ్ మాత్రమే రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లకు 3.30 గంటలకు ప్రారంభంకానున్నాయి.
తొలి విడతలో జరిగే 21 మ్యాచ్‌ల్లో మన తెలుగు రాష్ట్రాల్లో 4 జరగనున్నాయి. హైదరాబాద్‌లో రెండు, వైజాగ్‌లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి విడత పోటీలకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వైజాగ్‌ను హోంగ్రౌండ్‌గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ వేదికగా మార్చి 27న సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 5న హైదరాబాద్ వేదికగా మరో మ్యాచ్ జరగనుంది. చెన్నైసూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఇక వైజాగ్ వేదికగా ఈ నెల 31న తొలి మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నైసూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఏప్రిల్ 3న వైజాగ్ వేదికగా మరో మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.