Viral Video: ఇలాంటి క్యాచ్ నబూతో.. నభవష్యతి.. మీరు క్రికెట్ ఫ్యాన్స్ అయితే కచ్చితంగా చూడాల్సిందే..
ABN , Publish Date - Mar 09 , 2024 | 09:53 AM
ఎంతైనా క్రికెట్‌లో ఉండే మజానే వేరు. బ్యాటుతో బ్యాటర్లు సృష్టించే విధ్వంసం.. బాల్‌తో బౌలర్లు చేసే వికెట్లు వేట.. ఈ మధ్యలో ఫీల్డర్ల నైపుణ్యాలు.. ఇవన్నీ కలిసి అభిమానులను క్రికెట్ మ్యాచ్ నుంచి తిప్పుకోనివ్వకుండా చేస్తుంటాయి. టెస్టు ఫార్మాట్‌గా మొదలైన క్రికెట్ కాలానుగుణంగా వన్డే, టీ20 ఫార్మాట్లుగా రూపాంతరం చెందింది.
క్రైస్ట్‌చర్చ్: ఎంతైనా క్రికెట్‌లో ఉండే మజానే వేరు. బ్యాటుతో బ్యాటర్లు సృష్టించే విధ్వంసం.. బాల్‌తో బౌలర్లు చేసే వికెట్లు వేట.. ఈ మధ్యలో ఫీల్డర్ల నైపుణ్యాలు.. ఇవన్నీ కలిసి అభిమానులను క్రికెట్ మ్యాచ్ నుంచి తిప్పుకోనివ్వకుండా చేస్తుంటాయి. టెస్టు ఫార్మాట్‌గా మొదలైన క్రికెట్ కాలానుగుణంగా వన్డే, టీ20 ఫార్మాట్లుగా రూపాంతరం చెందింది. అయినా ఇప్పటికీ ఏ ఫార్మాట్‌కు ఉండే క్రేజ్ అలాగే ఉంది. మూడున్నర గంటల్లో ముగిసిపోయే టీ20 క్రికెట్ ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ రోజుల్లోనూ టెస్టు క్రికెట్‌కు కూడా క్రేజ్ బాగానే ఉంది. ఇప్పటికీ 5 రోజుల మ్యాచ్‌లకు మంచి ఆదరణ ఉంది. 5 రోజుల క్రికెట్‌లోని ఆటగాళ్ల ప్రదర్శనలు, జట్టు విజయాలు మిగతా ఫార్మాట్లలోని ప్రదర్శన కంటే ఎక్కువ గుర్తింపు తీసుకొస్తున్నాయి. కొన్నిసార్లు ఫీల్డర్ల విన్యాసాలు బ్యాటర్లు, బౌలర్ల ప్రదర్శన కంటే ఎక్కువ గుర్తింపును తీసుకొస్తాయి. కనురెప్పపాటులో ఫీల్డర్లు చేసే విన్యాసాలు మ్యాచ్ ఫలితాన్నే శాసించిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుత ఫీల్డింగ్ ఆకట్టుకుంది. చేప పిల్లలా గాల్లోకి డైవ్ చేసి ఒంటి చేతితో ఫిలిప్స్ పట్టిన క్యాచ్ నబూతో.. నభవష్యతి.. అని చెప్పుకోవాలి. ఒకసారి చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఆ క్యాచ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో టిమ్ సౌథీ వేసిన 61వ ఓవర్‌లో ఈ అద్భుతం జరిగింది. అప్పటికే 90 పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడుతున్న ఆస్ట్రేలియా వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఈ క్రమంలో 61వ ఓవర్ రెండో బంతిని సౌథీ వైడ్ ఆఫ్ స్టంప్ అవతలకు ఫుల్ లెంగ్స్ డెలివరీగా వేశాడు. ఆ బంతిని మార్నస్ లబుషేన్ వికెట్ల వెనుకకు ఫీల్డర్ల మధ్యగా గల్లీలో ఆడాడు. గల్లీలో బంతిని బౌండరీ బాదాలని భావించాడు. కానీ అక్కడికి దగ్గరలో ఫీల్డింగ్ చేస్తోన్న గ్లెన్ ఫిలిప్స్ ఆ బంతి కోసం చేప పిల్లలా గాల్లోకి ఎగిరాడు. కుడి వైపునకు అద్భుతంగా డైవ్ చేసి కన్ను చూపు మేరలో ఒంటి చేతితో క్యాచ్ అందుకున్నాడు. దీంతో లబుషేన్ ఔటయ్యాడు. 221 పరుగుల వద్ద ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.
ఫిలిప్స్ అద్భుత క్యాచ్‌తో షాక్‌లోకి వెళ్లిపోయిన లబుషేన్ చేసేదేమి లేక క్రీజును వదిలాడు. ఫిలిప్స్ అద్భుత క్యాచ్‌తో లబుషేన్ సెంచరీ చేజారగా.. ఆ కాసేపటికే ఆస్ట్రేలియా ఆలౌట్ కూడా అయింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 256 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో లబుషేన్ మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. గ్లెన్ ఫిలిప్స్ పట్టిన అద్భుత క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఈ క్యాచ్ కచ్చితంగా చూడాల్సిందేనని రాసుకొస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అతిథ్య న్యూజిలాండ్ 162 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 256 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 94 పరుగుల ఆధిక్యం లభించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.