Virat Kohli: కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన పాకిస్తాన్ ఆటగాడు..ఇక రోహిత్ శర్మ..
ABN , Publish Date - Jun 07 , 2024 | 08:03 AM
ఆతిథ్య అమెరికా జట్టుతో నిన్న జరిగిన టీ20 ప్రపంచకప్ 2024లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రపంచ రికార్డును పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam) బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ బాబర్ 44 పరుగుల ఇన్నింగ్స్ చేయడంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.
ఆతిథ్య అమెరికా జట్టుతో నిన్న జరిగిన టీ20 ప్రపంచకప్ 2024లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రపంచ రికార్డును పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam) బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ బాబర్ 44 పరుగుల ఇన్నింగ్స్ చేయడంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. అయితే కోహ్లీ రికార్డు బ్రేక్ చేసేందుకు బాబర్ 16 పరుగులు చేయాల్సి ఉండగా..పాక్ ఆటగాడు 44 రన్స్ చేసి అధిగమించాడు.
దీంతో పాక్ కెప్టెన్ 120 మ్యాచ్‌ల్లో 4067 అత్యధిక పరుగులు చేయగా, విరాట్ కోహ్లి 118 మ్యాచ్‌ల్లో 4038 పరుగులతో రెండో స్థానానికి దిగజారాడు. మరోవైపు రోహిత్ శర్మ(rohit sharma) 152 మ్యాచ్‌ల్లో 4026 పరుగులతో మూడో స్థానానికి చేరుకున్నాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్(international T20 cricket)లో కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే 4000 పరుగుల స్కోరును అందుకోవడంలో విజయం సాధించారు. ఆ ముగ్గురూ కూడా ఆసియాకు చెందిన వారే కావడం విశేషం.
డల్లాస్‌లోని గ్రాండ్ పియరీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బాబర్ అజామ్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. పాకిస్తాన్ జట్టు 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో బాబర్ మూడో వికెట్‌కు షాదాబ్ ఖాన్ (40)తో కలిసి 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయినప్పటికీ పాకిస్తాన్ జట్టు చివరకు అమెరికా చేతిలో ఓడిపోయింది. మరోవైపు జూన్ 9న పాకిస్తాన్, భారత్(bharat vs pakistan) మధ్య మ్యాచ్ జరగనుండగా..ఈ మ్యాచులో కోహ్లీ బాబర్ రికార్డును అధిగమిస్తాడని క్రీడాభిమానులు అంటున్నారు.
బాబర్ ఆజం(Babar Azam) 113 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు సాధించాడు. కోహ్లీ పేరిట ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉండగా, రోహిత్ 5 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. స్టెర్లింగ్ 143 మ్యాచ్‌ల్లో 3591 పరుగులు చేయగా, న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ 122 మ్యాచ్‌ల్లో 3531 పరుగులు చేశాడు.
ఇవి కూడా చదవండి..
T20 World Cup 2024: పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన అమెరికా
Sunil Chhetri : మెరుపు వీరుడి వీడ్కోలు
Indonesia Open : క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..