Share News

T20 World Cup 2024: న్యూయార్క్‌ చేరుకున్న టీమ్ ఇండియా.. సన్నాహాలు షురూ..

ABN , Publish Date - May 29 , 2024 | 08:53 AM

క్రికెట్ క్రీడాభిమానలకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇటివల ఐపీఎల్ 2024 ముగియగా, ఇప్పుడు మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) మొదలు కానుంది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ అమెరికా, వెస్టిండీస్‌ దేశాల్లో జరగనుంది. తక్కువ సమయం ఉన్న క్రమంలో టీమ్ ఇండియా అమెరికా చేరుకున్న తర్వాత సన్నాహాలను ప్రారంభించింది.

T20 World Cup 2024: న్యూయార్క్‌ చేరుకున్న టీమ్ ఇండియా.. సన్నాహాలు షురూ..
Team India arrived in New York preparations

క్రికెట్ క్రీడాభిమానలకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇటివల ఐపీఎల్ 2024 ముగియగా, ఇప్పుడు మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) మొదలు కానుంది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ అమెరికా, వెస్టిండీస్‌ దేశాల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో టోర్నీ కోసం ఇప్పటికే టీమ్ ఇండియా(Team India) అమెరికా చేరుకుంది. తక్కువ సమయం ఉన్న క్రమంలో అమెరికా చేరుకున్న తర్వాత సన్నాహాలను ప్రారంభించింది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు న్యూయార్క్‌లో రన్నింగ్ చేస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో క్రీడాకారులు పంచుకున్నారు.


రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు(Team India) 2 వేర్వేరు బ్యాచ్‌లలో న్యూయార్క్ చేరుకుంది. ఇందులో ప్రధాన జట్టుతో పాటు, రిజర్వ్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(virat kohli) మాత్రమే ఇంకా జట్టులో చేరలేదు. అయితే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా న్యూయార్క్‌లో టీమ్ ఇండియాలో చేరి సన్నాహాలు ప్రారంభించాడు. మే 28 మంగళవారం రోజు టీమ్ ఇండియా సన్నద్ధత దిశగా తొలి అడుగు వేసింది. ఈ క్రమంలో నేడు కూడా న్యూయార్క్ వాతావరణానికి అనుగుణంగా తేలికపాటి శిక్షణతో సన్నాహాలు ప్రారంభించారు. లైట్ రన్నింగ్, వ్యాయామం చేస్తూ శిక్షకుల పర్యవేక్షణలో గడిపారు. ఈ క్రమంలో ఆటగాళ్లు తమను తాము రిఫ్రెష్ చేసుకునే పనిలో ఉన్నారు.


టీ20 ప్రపంచకప్‌ కోసం న్యూయార్క్‌(New York)లో జరగనున్న మ్యాచ్‌లు ఈ నగరంలోని నాసో కౌంటీలో నిర్మించిన స్టేడియంలో జరగనున్నాయి. టీమ్ ఇండియా ఇక్కడ గ్రూప్ దశలో 4 మ్యాచ్‌ల్లో 3 ఆడాల్సి ఉంది. ఇక భారత్ మొదటి మ్యాచ్ ఐర్లాండ్ జట్టుతో జూన్ 4న నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్‌లో జరగనుంది. జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో సహా ఈ కొత్త స్టేడియంలో భారత జట్టు మూడు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది.


ఇది కూడా చదవండి:

కోచ్‌గా గంభీర్‌ ఖరారేనా?


అందరి దృష్టీ ఆ పోరుపైనే!

Read Latest Sports News and Telugu News

Updated Date - May 29 , 2024 | 08:56 AM