Share News

BRS: బీఆర్‌ఎస్‏కు గుర్తుల గుబులు..! రోడ్‌ రోలర్‌, చపాతి మేకర్‌ ఎఫెక్ట్‌ భయం

ABN , Publish Date - May 01 , 2024 | 10:51 AM

ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయి. తమ పార్టీ గుర్తును పోలిన గుర్తులు పలు పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌(BRS) అభ్యర్థులను గతంలోలానే రోడ్‌ రోలర్‌, చపాతి మేకర్‌ గుర్తులు ఆందోళన కలిగిస్తున్నాయి.

BRS: బీఆర్‌ఎస్‏కు గుర్తుల గుబులు..!  రోడ్‌ రోలర్‌, చపాతి మేకర్‌ ఎఫెక్ట్‌ భయం

- రోడ్‌ రోలర్‌, చపాతి మేకర్‌ ఎఫెక్ట్‌ భయం

- సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ స్థానాలకు కేటాయింపు

హైదరాబాద్‌ సిటీ: ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయి. తమ పార్టీ గుర్తును పోలిన గుర్తులు పలు పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌(BRS) అభ్యర్థులను గతంలోలానే రోడ్‌ రోలర్‌, చపాతి మేకర్‌ గుర్తులు ఆందోళన కలిగిస్తున్నాయి. యుగ తులసి పార్టీకి ఎన్నికల సంఘం అధికారికంగా రోడ్‌ రోలర్‌ గుర్తు కేటాయించగా.. మరో స్వతంత్ర అభ్యర్థికి చపాతి మేకర్‌ గుర్తు దక్కింది. బ్యాలెట్‌లో నాలుగో అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ నుంచి పోటి చేస్తోన్న టీ పద్మారావుగౌడ్‌ ఉండగా.. ఐదో అభ్యర్థిగా రోడ్‌ రోలర్‌ గుర్తున్న యుగ తులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్‌ ఉన్నారు.

ఇదికూడా చదవండి: TG: నా గుండుతో నీకేం పని రేవంతన్నా..

city2.jpg

పోలిన గుర్తులు బ్యాలెట్‌లో ఒకే చోట ఉండడంతో ఓటర్లు అయోమయానికి గురవుతారన్న భయం బీఆర్‌ఎస్‌ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌(Hyderabad)లో స్వతంత్ర అభ్యర్థికి చపాతి మేకర్‌ గుర్తు కేటాయించారు. రోడ్‌ రోలర్‌, చపాతి మేకర్‌ గుర్తులను ఏ పార్టీకి, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా ఆదేశాలు జారీ చేయాలని అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

ఇదికూడా చదవండి: Hyderabad: కాంగ్రెస్‌ కార్నర్‌ మీటింగ్‌లు.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 01 , 2024 | 10:51 AM