ABN Big Debate: ఆ విషయంలో రేవంత్ చాలా బెటర్.. బిగ్‌డిబేట్‌లో కొండా ఇంట్రస్టింగ్ కామెంట్స్..
ABN , Publish Date - May 03 , 2024 | 07:52 PM
ABN Big Debate with Konda Vishweshwar Reddy: ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణతో బిగ్ డిబేట్‌లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో తెలంగాణలో ప్రభుత్వం కొనసాగుతున్న తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ సమయం కంటే.. ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కేసీఆర్ సీఎంగా అప్పులు తీసుకున్నారు..
ABN Big Debate with Konda Vishweshwar Reddy: ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణతో బిగ్ డిబేట్‌లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో తెలంగాణలో ప్రభుత్వం కొనసాగుతున్న తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ సమయం కంటే.. ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కేసీఆర్ సీఎంగా అప్పులు తీసుకున్నారు.. ఇప్పుడు ఆ అప్పులు కట్టాల్సిన సమయం వచ్చింది. అందుకే పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఇప్పుడు రూ. 80 వేల కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉంది. రూ. 60 వేల కోట్లు జీతాల కోసం చెల్లించాల్సి ఉంది. స్టేట్ ఓన్ రెవన్యూ రూ. 1.40 లక్షల కోట్లు మాత్రమే. దీన్నిబట్టి ఆర్థిక పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.’ అని అన్నారు.
మోదీనే ఆదుకున్నారు..
‘మోదీని పెద్దన్న పెద్దన్న అన్నారు కదా.. నిజంగానే మోదీ పెద్దన్న మాదిరిగానే తెలంగాణను ఆదుకున్నారు. పెద్దన్న అని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే.. రెండు మూడు కానుకలు ఇచ్చారు. రూ. 9 వేల కోట్లు ఇకసారి. మరోసారి రూ. 4 వేల కోట్లు ఒకసారి ఇచ్చారు. ఇవ్వకుంటే రాష్ట్రం నడవదు.’ అని ప్రధాని మోదీ తెలంగాణను ఆదుకున్న విధానాన్ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివరించారు.
రేవంత్ మంచోడే.. కానీ..
‘సీఎం రేవంత్ రెడ్డి మంచోడే. కానీ.. ఢిల్లీ పార్టీ పెద్దల ఆదేశాలు, ఆలోచనల మేరకు 6 గ్యారెంటీలను తీసుకువచ్చి ఇబ్బందులను కొనితెచ్చుకున్నారు. ఈ 6 గ్యారెంటీలు అసాధ్యమైన పథకాలు. ఢిల్లీ పెద్దలు ఆయన మీద రుద్దారు. ఇక రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలంటే రూ. 30 వేల కోట్లు కావాలి. ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ఈ పథకం తీసుకువచ్చారు. కానీ, ఇక్కడ రూ. 3 వేల కోట్లు కూడా లేవు. ఆగస్టు 15 అని డెడ్ లైన్ పెట్టారు. గోడమీద ‘రేపు’ అని రాస్తే.. అది ఎప్పుడు చూసినా ‘రేపు’ అనే ఉంటుంది. ఈ ఆగస్ట్ 15 కూడా అలాగే ఉంటుంది.’ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆ విషయంలో కేసీఆర్ కంటే రేవంత్ బెటర్..
‘నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగా కాకుండా.. కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డి మంచి టర్మ్స్ కంటిన్యూ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో, ప్రధాని మోదీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా.. ప్రభుత్వం పరంగా రేవంత్ చేసేది మంచి పని’ అని కొండా కితాబిచ్చారు.