Share News

Hyderabad: ఓట్ల పండుగేమో కానీ.. అక్కడ మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్.. బండి కదిలితే ఒట్టు..

ABN , Publish Date - May 12 , 2024 | 10:59 AM

ఓట్ల పండుగకు కొద్ది గంటలే సమయం ఉంది. దీంతో జనాలంతా స్వస్థలాలకు బయలుదేరి వెళుతున్నారు. హైదరాబాద్ నగరమంతా ఖాళీగా కనిపిస్తోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏపీకి బండ్లు క్యూ కట్టాయి. ఎన్ని బస్సులు వేసినా చాలడం లేదు. రైళ్ల పరిస్థితి కూడా అంతే ఉంది. ఇక ఎల్బీనగర్ - విజయవాడ హైవే మార్గంలో చెప్పాల్సిన పని లేదు. అడుగడుగునా ట్రాఫిక్ జామ్. బండి కదిలితే ఒట్టు.

Hyderabad: ఓట్ల పండుగేమో కానీ.. అక్కడ మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్.. బండి కదిలితే ఒట్టు..

హైదరాబాద్ : ఓట్ల పండుగకు కొద్ది గంటలే సమయం ఉంది. దీంతో జనాలంతా స్వస్థలాలకు బయలుదేరి వెళుతున్నారు. హైదరాబాద్ నగరమంతా ఖాళీగా కనిపిస్తోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏపీకి బండ్లు క్యూ కట్టాయి. ఎన్ని బస్సులు వేసినా చాలడం లేదు. రైళ్ల పరిస్థితి కూడా అంతే ఉంది. ఇక ఎల్బీనగర్ - విజయవాడ హైవే మార్గంలో చెప్పాల్సిన పని లేదు. అడుగడుగునా ట్రాఫిక్ జామ్. బండి కదిలితే ఒట్టు. అంతగా ట్రాఫిక్. ఏదో కదలాలా వద్దా అన్నట్టుగా కదులుతున్నాయి. ఈ ట్రాఫిక్‌లో వాహనదారుల ఇబ్బందులు మాటల్లో చెప్పలేనివి. హైదరాబాద్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులంతా తెలంగాణ నుంచి ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల పైనే ఆధారపడ్డారు.

ఇవి కూడా చదవండి..

BRS: కేసీఆర్ నేటి దేవరకొండ పర్యటన రద్దు

TS News: అందమైన వాయిస్‌తో వలపు వల... కలుద్దామని పిలిచి నిలువు దోపిడి..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2024 | 11:00 AM