Share News

Telangana: ఆర్టీసీ సిబ్బందిపై వరస దాడులు.. హెచ్చరించినా మార్పు రాని వైనం..

ABN , Publish Date - Jan 31 , 2024 | 12:05 PM

ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం - శుభప్రదం అనే మాటలు కేవలం రాతలకు పరిమితమవుతున్నాయి. ప్రయాణీకుల భద్రతే లక్ష్యంగా సేవలందిస్తోన్న ఆర్టీసీ సిబ్బందికే రక్షణ లేకుండా పోతోంది.

Telangana: ఆర్టీసీ సిబ్బందిపై వరస దాడులు.. హెచ్చరించినా మార్పు రాని వైనం..

ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం - శుభప్రదం అనే మాటలు కేవలం రాతలకు పరిమితమవుతున్నాయి. ప్రయాణీకుల భద్రతే లక్ష్యంగా సేవలందిస్తోన్న ఆర్టీసీ సిబ్బందికే రక్షణ లేకుండా పోతోంది. డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. నానా బూతులు తిడుతూ, దుర్భాషలాడుతూ, కొడుతూ, తంతూ పలువురు దాడికి పాల్పడుతున్నారు. దీంతో తమ విధులు తాము సక్రమంగా నిర్వర్తించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. వరసగా జరుగుతున్న ఘటనలే ఈ పరిస్థితికి నిదర్శనంగా మారాయి. ఈ దాడులపై ఉన్నతాధికారులు స్పందించి హెచ్చరిస్తున్నా మార్పు రాకపోవడం గమనార్హం.

తాజాగా హయత్‌నగర్‌ డిపో-1కు చెందిన కండక్టర్‌పై మహిళా ప్రయాణికురాలు దాడి చేసింది. ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది. ఈఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీకి డ్రైవర్లు, కండక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లని, వారిపై దాడి చేయడం సరికాదని ఎండీ సజ్జనార్ అన్నారు. కొత్తగూడెం జిల్లాలో డ్రైవర్, కండక్టర్​ను ప్యాసింజర్లు దూషించడం, ఆటో డ్రైవర్లు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.


కాగా.. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. అధికారులూ హెచ్చరించారు. కానీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. చిల్లర ఇవ్వలేదనో లేక వచ్చిన స్టాప్ వివరాలు ఇవ్వలేదనో సరిగ్గా స్పందించలేదనో ఇలా ఎన్నో కారణాలతో ప్రయాణికులు దాడికి పాల్పడగా.. రోడ్డుపై ప్రయాణించే తోటి వాహనదారులు కూడా దాడికి పాల్పడటం గమనార్హం. రేవంత్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణీకుల మధ్యే ఎన్నో గొడవలు జరిగాయి. వాటిని ఎంతో నేర్పుతో, ఓర్పుతో సహించిన సిబ్బందిపైనే ఇలా దాడికి పాల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 31 , 2024 | 12:26 PM