Share News

Raj Tarun: లావణ్య, రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్

ABN , Publish Date - Jul 11 , 2024 | 11:55 AM

లావణ్య, హీరో రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని రాజ్‌తరుణ్‌పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. లావణ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజ్‌ ఇటీవల చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి హీరోకు బిగ్ షాక్ తగిలింది..

Raj Tarun: లావణ్య, రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్
Lavanay, Raj Tarun Case

హైదరాబాద్, జూలై 11: లావణ్య, హీరో రాజ్ తరుణ్ (Lavanya-Raj Taruna Case) కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని రాజ్‌తరుణ్‌పై (Hero Raj Tarun) లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. లావణ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజ్‌ ఇటీవల చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి హీరో రాజ్‌తరుణ్‌కు బిగ్ షాక్ తగిలింది. నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో హీరోతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. ఏ 1 గా రాజ్ తరుణ్, ఏ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రాన్ని చేర్చుతూ నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..?



ఇదీ సంగతి...

‘‘2008 నుంచి రాజ్ తరుణ్‌కు లావణ్య పరిచయం. 2010లో లావణ్యకు ప్రపోజ్ చేసిన రాజ్ తరుణ్. 2014లో రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. రాజ్ తరుణ్‌ను మా కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుంది. రాజ్ తరుణ్‌కు ఉన్న ఆర్థిక సమస్యలు మొత్తాన్ని మా కుటుంబం భరించింది. రాజ్ తరుణ్‌కు ఇప్పటివరకు 70 లక్షల రూపాయలు ఇచ్చాము. రాజ్ తరుణ్ కుక్కల కారణంగా 6 సంవత్సరాల్లో 6 ఇళ్లులు మారాల్సి వచ్చింది. 2016లో నేను గర్భవతి అయ్యాను. రెండవ నెలలో నాకు సర్జరీ చేశారు. నా హాస్పిటల్ బిల్స్ అన్ని రాజ్ తరుణ్ చెల్లించాడు. జనవరిలో నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చాను . సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నన్ను పోలీసులు అరెస్టు చేశారు. నాపై డ్రగ్స్ కేస్ ఉందంటూ తప్పుడు ఆరోపణలతో పోలీసులు నన్ను రిమాండ్ చేశారు. 45 రోజులు నేను జైల్లో ఉన్నాను. రాజ్ తరుణ్‌తో పాటు మాల్వి మల్‌హోత్రా ఇద్దరు కలిసి నన్ను ఇరికించారు. ప్రేమ,పెళ్లి పేరుతో మోసం చేసినందుకు రాజ్ తరుణ్‌పై చర్యలు తీసుకోవాలి’’ అంటూ లావణ్య ఫిర్యాదులో పేర్కొంది.


తనను చంపేస్తామని బెదిరించి భయబ్రాంతులకు గురి చేసిన మాల్వితో పాటు ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపింది. ఈ క్రమంలో ఎప్‌ఐఆర్‌లో ముగ్గురీ పేర్లను పోలీసులు చేర్చారు. ఐపీసీ 420,493,506 సెక్షన్ల కింద ముగ్గురిపైనా కేసు నమోదు అయ్యింది.


ఇవి కూడా చదవండి...

T.High Court: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో విచారణ

Bandi Sanjay: ఐదేళ్లుగా వీరప్పన్ వారసుల చేతిలో టీటీడీ పాలన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 11 , 2024 | 12:36 PM