Share News

CM Revanth Reddy: తెలంగాణ‌కు రావాల్సిన నిధులు విడుద‌ల చేయండి

ABN , Publish Date - Jan 05 , 2024 | 10:26 PM

తెలంగాణ‌కు వెనుక‌బడిన ప్రాంతాల అభివృద్ధి కింద 2019-20, 2021-22 నుంచి 2023-24 వ‌ర‌కు సంవ‌త్స‌రానికి రూ.450 కోట్ల చొప్పున విడుద‌ల చేయాల్సిన రూ.1800 కోట్లు విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ ( Nirmala Sitharaman ) కు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) విజ్ఙ‌ప్తి చేశారు.

CM Revanth Reddy: తెలంగాణ‌కు రావాల్సిన నిధులు విడుద‌ల చేయండి

న్యూఢిల్లీ: తెలంగాణ‌కు వెనుక‌బడిన ప్రాంతాల అభివృద్ధి కింద 2019-20, 2021-22 నుంచి 2023-24 వ‌ర‌కు సంవ‌త్స‌రానికి రూ.450 కోట్ల చొప్పున విడుద‌ల చేయాల్సిన రూ.1800 కోట్లు విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ ( Nirmala Sitharaman ) కు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) విజ్ఙ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఆమె కార్యాల‌యంలో క‌లిశారు. 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన రూ.2,233.54 కోట్లు త్వ‌ర‌గా విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధికి ప్ర‌త్యేకంగా నిధులు కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

1N-R.jpg

Updated Date - Jan 05 , 2024 | 10:26 PM