Share News

Niranjan reddy: రైతుల సంఖ్యను కుదించేందుకే రుణమాఫీ మార్గదర్శకాలు

ABN , Publish Date - Jul 17 , 2024 | 03:11 PM

Telangana: రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రైతుల సంఖ్యను కుదించేందుకే రుణమాఫీ మార్గదర్శకాలు అని మండిపడ్డారు. లోపభూయిష్టంగా రుణమాఫీపై ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయన్నారు.

Niranjan reddy: రైతుల సంఖ్యను కుదించేందుకే రుణమాఫీ మార్గదర్శకాలు
Former Minister Niranjan Reddy

హైదరాబాద్, జూలై 17: రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Former Minister Singireddy Niranjan Reddy)డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రైతుల సంఖ్యను కుదించేందుకే రుణమాఫీ మార్గదర్శకాలు అని మండిపడ్డారు. లోపభూయిష్టంగా రుణమాఫీపై ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయన్నారు. 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం అంటున్నారని.. మిగిలిన 49 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.

CM Chandrababu: ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన


రైతుల గుర్తింపునకే రేషన్ కార్డు అంటున్నారని.. మరి రేషన్ కార్డులేని రైతుల పరిస్థితి ఏంటి అని నిలదీశారు. కనీసం ఐదెకరాల వరకు ఉన్న రైతులకన్నా రైతుభరోసా ఇవ్వాలన్నారు. రుణమాఫీకి పట్టదారు పాస్ బుక్కును ప్రామాణికంగా తీసుకుంటే రైతు భరోసాకు కూడా దానినే ప్రామాణికంగా తీసుకుని ఇవ్వాలన్నారు. రైతుభరోసా ఎగ్గొట్టి రుణమాఫీకి నిధులు మళ్లిస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

TDP: 11 సీట్లు ఎందుకు ఇచ్చామా అని ప్రజలు ఆలోచిస్తున్నారు..: బుద్దా వెంకన్న


ఇంతకీ మార్గదర్శకాల్లో ఏముందంటే...

ఆగష్టు 15లోనే రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం రుణమాఫీపై మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుంది. స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తోందని షరతు విధించారు. రాష్ట్రంలో గల షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేదా రెన్యువల్ అయిన రుణాలకు, 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 09-12-2023 వరకు బకాయి ఉన్న అసలు, వడ్డీ మొత్తం రుణ మాఫీ పథకానికి అర్హత కలిగి ఉంటుంది.రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ ఆహార భద్రత కార్డు (పీడీఎస్) డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది.


ఇవి కూడా చదవండి...

Harish Rao: ఆ ఎమ్మెల్యేలను మాజీలను చేసేవరకు నిద్రపోం..

Viral: భార్య ట్యాబ్ ఓపెన్ చేసిన భర్తకు దిమ్మదిరిగే షాక్.. అందులో ఫొటోలు చూసి భర్త తీసుకున్న నిర్ణయం ఏంటంటే..!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 17 , 2024 | 03:14 PM