Harish Rao: గురుకులాల్లో విద్యార్థులకు పాము కాట్లపై హరీష్ ఫైర్
ABN , Publish Date - Sep 12 , 2024 | 09:41 AM
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సరిగా లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిడుతున్నారు. అసలు రాష్ట్రంలో పాలన ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇంకా అమలుకాలేదంటూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 12: కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Govt) బీఆర్‌ఎస్ నేతల (BRS) విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సరిగా లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిడుతున్నారు. అసలు రాష్ట్రంలో పాలన ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇంకా అమలుకాలేదంటూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. రైతు రుణమాఫీ విషయంలోనే ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి. పూర్తిగా రుణమాఫీ అవ్వలేదంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. తాజాగా గురుకుల్లాల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితిపై ఎమ్మెల్యే హరీష్ రావు (MLA Harish Rao) ట్విట్టర్ వేదికగా స్పందించారు. గురుకులాల్లో విద్యార్థులను పాములు కాటేస్తున్నా సర్కార్ పట్టించుకునే స్థితిలో లేదంటూ మండిపడుతున్నారు. గురుకులాల్లో పాము, కుక్క కాట్లపై ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.
Army Officers: ఇద్దరు ఆర్మీ అధికారులపై దారుణంగా దాడి.. స్నేహితురాలిపై సామూహిక అఘాయిత్యం
హరీష్ ట్వీట్ ఇదే..
‘‘గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు పాము కాట్లకు గురై ప్రాణాల మీదకు వస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలంటే ఎంతమంది ఆసుపత్రుల పాలు కావాలి, ఇంకెన్ని ప్రాణాలు పోవాలి. ఒకప్పుడు నాణ్యమైన విద్యకు చిరునామా అయిన గురుకులాల్లో నేడు పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు నిత్యకృత్యం కావడం దురదృష్టకరం’’అంటూ హరీష్‌రావు ట్వీట్ చేశారు.
Gold and Silver Rates: బంగారు ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
అసలేం జరిగిందంటే?
కాగా.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ స్థానిక శాస్త్రీనగర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాలయంలో ఆరో తరగతి విద్యార్థి మన్విత్ పాము కాటుకు గురయ్యాడు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మన్విత్ బాత్రూమ్ వెళ్తున్న సమయంలో తలుపు వద్దే ఉన్న పాము కాటేసింది. దీంతో విద్యార్థి భయంతో కేకలు వేయడంతో స్కూల్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. పాము కాటుకు గురైన మన్విత్‌ను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడికి ప్రాణాపాయం ఏమీ లేదని.. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని డాక్టర్లు సూచించినట్లు పాఠశాల సిబ్బంది తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
Amrapali Kata: భక్తులకు ఇబ్బంది కలగొద్దు..!
YS Jagan: రాష్ట్ర ప్రజలంతా ఓవైపు.. ఆయన మాత్రం మరోవైపు..
Read Latest Telangana News And Telugu News