Share News

Heavy Rain: బాబోయ్ వర్షం... హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

ABN , Publish Date - Jul 20 , 2024 | 10:06 AM

Telangana: భాగ్యనగరంలో భారీీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు భాగ్యనగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లేవారు వర్షం కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో భాగ్యనగరానికి వాతవారణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది.

Heavy Rain: బాబోయ్ వర్షం... హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్
Heavy Rains

హైదరాబాద్, జూలై 20: భాగ్యనగరంలో (Hyderabad) కుండపోత వర్షం (Heavy Rains) కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు భాగ్యనగరవాసులు అల్లాడిపోతున్నారు. ఉదయం స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లేవారు వర్షం కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో భాగ్యనగరానికి వాతవారణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, రాయదుర్గంలో వర్షం కురుస్తోంది.

Rain Alert: ఈ ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్..


మెహిదీపట్నం, షేక్ పేట్, టోలిచౌకి పరిసర ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా వర్షం పడుతోంది. మాసబ్ ట్యాంక్, నాంపల్లి గోషామహల్‌లో, బేగంపేట్ , సికింద్రాబాద్, మల్కాజిగిరి, కంటోన్మెంట్‌లో ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉంది. వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమతమైంది. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలంటూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే 040- 2111111 టోల్ ఫ్రీ నెంబర్లను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేశారు.

Hyderabad: నియో.. కుయ్యో మొర్రో...



సీఎస్ ఆదేశాలు ఇవే...

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వర్షం కుమ్మేస్తోంది. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. జూలై 20, 21 తేదీలలో 11 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తర తెలంగాణాలోని 11 జిల్లాలలో ఈనెల 20 , 21 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని తెలిపారు.


పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, ఖమ్మం,కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన విషయాన్ని సీఎస్.. కలెక్టర్లకు గుర్తుచేశారు. ఈ 11 జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఏ విధమైన సహాయం కావాలన్న రాష్ట్ర రాజధానికి ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చుని సీఎస్ శాంతికుమారి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

KTR: కాంగ్రెస్ కుట్రలు పటాపంచలయ్యాయ్.. మేడిగడ్డ నిండుకుండలా కావడంపై కేటీఆర్ హర్షం..

‘పుంగనూరు’లో పెద్దిరెడ్డి అరాచకాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 20 , 2024 | 11:44 AM