Bandi Sanjay: బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అస్సలు తేడా లేదు
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:52 PM
Telangana: కాంగ్రెస్ ప్రజా పాలనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్... రేవంత్ రెడ్డి సేమ్ టు సేమ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అస్సలు తేడా లేదని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 12: కాంగ్రెస్ ప్రజా పాలనపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్... రేవంత్ రెడ్డి సేమ్ టు సేమ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అస్సలు తేడా లేదని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్ 17పై సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చటం సిగ్గుచేటన్నారు. ఆరు గ్యారంటీలను డైవర్ట్ చేయటానికే హైడ్రా పేరుతో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.
TG Politics: కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి.. గ్రేటర్‌లో వేడెక్కిన రాజకీయం
ప్రజా పాలన దినోత్సవం కాదని... విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. రైతులను నడ్డి విరచటమే కాంగ్రెస్ ప్రజ పాలన అంటూ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను మోసం చేయటమే కాంగ్రెస్ ప్రజాపాలన అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్టుకోవటమే ప్రజా పాలన అని అన్నారు. విదేశాల్లో భారతదేశంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. టెర్రరిస్టులతో రాహుల్ గాంధీకి సంబంధాలున్నాయని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ కంట్రోల్‌లో ఉంటే 500 ఎంపీ సీట్లు గెలుచుకునేవాళ్ళమని తెలిపారు. సిక్కులను ఊచకోత కోసిందే రాహుల్ గాంధీ కుటుంబం అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి...
TG News: ఖమ్మంలో కేంద్ర బృందం పర్యటన
Maheshkumar: తెలంగాణలో ఉపఎన్నికలపై టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Read LatestTelangana NewsAndTelugu News