Share News

TG News: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే..

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:05 AM

Telangana: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పోలీసు అధికారులు తలదించుకునేలా చేసింది. ఓ చిన్న గొడవనే పెద్దదిగా చేసి యువకులను పోలీసులు మానసికంగా వేధించారు. అంతేకాకుండా పోలీసులు తీరుతో మనస్థాపం చెందిన ఓ యువకుడు ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు.

TG News:  ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే..
Police misbehavior with three youths Nagarkurnool

నాగర్ కర్నూల్ జిల్లా , అక్టోబర్ 19: ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే వారిపట్ల భక్షకులుగా మారారు. ఎంతటి పెద్ద గొడవలనైనా సులువుగా నివారించాల్సిన ఖాకీలే గొడవను పెద్దది అయ్యేలా చేశారు. చివరకు ఓ మనిషి ప్రాణాల మీదకు తెచ్చుకునేలా ప్రవర్తించారు కాప్స్. ఇంతకీ ఏం జరిగింది... పోలీసులు ఏ విషయంలో గొడవపడ్డారు... ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకోవాలడానికి ఎందుకు యత్నించాడో ఇప్పుడు తెలుసుకుందాం.

Road Accident: అతివేగంగా దూసుకొచ్చిన కారు.. ఇంతలోనే



ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పోలీసు అధికారులు తలదించుకునేలా చేసింది. ఓ చిన్న గొడవనే పెద్దదిగా చేసి యువకులను పోలీసులు మానసికంగా వేధించారు. అంతేకాకుండా పోలీసులు తీరుతో మనస్థాపం చెందిన ఓ యువకుడు ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు. నాగర్‌కర్నూలు జిల్లా లింగాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.


జిల్లాలోని లింగాల వద్ద పెట్రోల్ బంక్‌లో ఓ చిన్న గొడవ జరిగింది. ఈ విషయాన్ని పోనీలే వదిలేయాల్సిన పోలీసులు గొడవలో అతిగా ప్రవర్తించారు. ముగ్గురు యువకులతో పోలీసులు గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా ఎస్‌ఐ జగన్మోహన్ రెడ్డి యువకులతో అనుచితంగా ప్రవర్తించాడు. వారికి సర్ధిచెప్పాల్సిన సదరు ఎస్సై.. ముగ్గురు యువకులకు గుండు గీయించాడు. ఈ వ్యవహారంతో ఆ ముగ్గురు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చివరకు నితీష్ అనే యువకుడు మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని నాగర్‌ కర్నూల్‌ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Hyderabad: గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు..


అయితే ఇంత జరిగినప్పటికీ ఆ పోలీసులు మాత్రం తమ బుద్దిని పోనిచ్చుకోలేదు. ఈ వివరాలు ఎక్కడా వెల్లడించవద్దంటూ హుకుం జారీ చేశారు. మిగతా ఇద్దరూ యువకులను హైదరాబాద్ వెళ్లండి అంటూ పోలీసులు ఆదేశించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు పోలీసుల పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న గొడవకి ఇంతలా వేధిస్తారా అంటూ జనం మండిపడుతున్నారు. మరి ఈ విషయంపై పోలీసులు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి...

TG News: ప్రేమించిన యువతి దూరం పెట్టడంతో సహించలేని ఓ యువకుడు ఏం చేశాడంటే

Delhi Liquor Case: రౌస్ ఎవిన్యూ కోర్టులో లిక్కర్ పాలసీ కేసు విచారణ.. హాజరుకానున్న కవిత..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 19 , 2024 | 12:45 PM