Share News

వెలమలపై నోరుపారేసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

ABN , Publish Date - Dec 07 , 2024 | 04:06 AM

షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ వెలమలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలమలను అసభ్యపదజాలంతో దూషించారు.

వెలమలపై నోరుపారేసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

  • భగ్గుమన్న ఆ కుల సంఘాలు.. పోలీసులకు ఫిర్యాదు

  • శంకర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: ఎమ్మెల్సీ కవిత

షాద్‌నగర్‌, ఖమ్మం క్రైమ్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ వెలమలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలమలను అసభ్యపదజాలంతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవ్వగా వెలమ కుల సంఘాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే శంకర్‌ 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత వెలమ సంఘం డిమాండ్‌ చేసింది.


అలాగే, పద్మనాయక వెలమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే శంకర్‌పై ఖమ్మం టూటౌన్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కాగా, ఎమ్మెల్యే శంకర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. శంకర్‌ వ్యాఖ్యలు వెలమల పట్ల కాంగ్రెస్‌ అధికారిక వైఖరా ? అని సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ను ఆమె ప్రశ్నించారు. కాగా, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే శంకర్‌ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ స్పందించారు. వెలమలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని శంకర్‌ను ఆదేశించారు.

Updated Date - Dec 07 , 2024 | 04:06 AM