Share News

TG News: కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో ఏసీబీ సోదాలు.. కారణమిదే!

ABN , Publish Date - Aug 13 , 2024 | 10:13 AM

Telangana: నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. పిల్లలకు అందుతున్నకాస్మొటిక్ చార్జెస్, పౌష్టికాహారం, ఆడిట్ వివరాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలాజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, పే అండ్ అకౌంట్స్ శాఖల అధికారులు సోదాలు నిర్వహించారు.

TG News: కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో ఏసీబీ సోదాలు.. కారణమిదే!
ACB Raids

నిజామాబాద్, ఆగస్టు 13: నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో ఏసీబీ (ACB) అధికారుల సోదాలు నిర్వహించారు. పిల్లలకు అందుతున్నకాస్మొటిక్ చార్జెస్, పౌష్టికాహారం, ఆడిట్ వివరాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలాజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, పే అండ్ అకౌంట్స్ శాఖల అధికారులు సోదాలు నిర్వహించారు. హాస్టల్‌లో పిల్లలు పడుతున్న ఇబ్బందులు, వసతులపై అధికారులు ఆరా తీశారు. పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈరోజు (మంగళవారం) ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు ముందే హాస్టల్‌లో సోదాలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫుడ్‌కి సంబంధించిన కొన్ని పదార్థాలను సీజ్ చేసి ల్యాబ్ పంపనున్నారు.

Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు


అవినీతి తిమింగళం...

కాగా.. ఇటీవలే మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి తిమింగాలన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో నిజామాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ సూపరింటెండెంట్‌ దాసరి నరేందర్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాసరి నరేందర్‌ ఇంటితో పాటు ఆయన కార్యాలయం, బంధువుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటలకు మొదలైన సోదాలు అర్ధరాత్రి దాటినా కొనసాగాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన 25 మంది ఏసీబీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు.

CM Chandrababu: వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..


తనిఖీల్లో భాగంగా దాదాపు రూ.3కోట్ల నగదు(2,93,81,000)ను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆయన బ్యాంకు ఖాతాలో రూ.1.10కోట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు నరేందర్‌ ఇంట్లో ఉన్న 51తులాల బంగారం, 17 స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను సీజ్‌ చేశారు. నరేందర్‌ ఆఫీసులో రూ.90వేలు దొరికాయి. అధికారులు సీజ్‌ చేసిన నగదు, బంగారం, ఆస్తి పత్రాల విలువరూ.6,07,81,000. ఒక సూపరింటెండెంట్‌ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. నోట్లను లెక్క పెట్టడానికి రెండు కౌంటింగ్‌ మిషన్లను ఉపయోగించారు. నిజామాబాద్‌ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ఇంత భారీ స్థాయిలో నగదు పట్టుబడటం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. అవినీతికి పాల్పడిన నరేందర్‌ను అరెస్టు చేశారు.


ఇవి కూడా చదవండి...

Marnus Labuschange: వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ బ్యాట్‌కు రిటైర్మెంట్.. ఆసీస్ ఆటగాడు మార్న‌స్ ల‌బూషేన్ విచారం..!

Stock Market: స్వల్ప నష్టాల్లో సూచీలు.. అప్రమత్తంగా నిఫ్టీ, సెన్సెక్స్..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2024 | 10:56 AM