TPCC Chief Post: టీ పీసీసీ చీఫ్ కోసం లాబీయింగ్..! రేసులో జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి
ABN , Publish Date - Jan 10 , 2024 | 04:28 PM
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నెలరోజులు గడిచాయి. సీఎం పదవీతోపాటు టీ పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. 2, 3 నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోపు టీ పీసీసీ చీఫ్‌ను నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందని తెలిసింది.
హైదరాబాద్: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) బాధ్యతలు చేపట్టి నెలరోజులు గడిచాయి. పాలనపరంగా అన్ని విభాగాలపై క్రమంగా పట్టు సాధిస్తున్నారు. సీఎం పదవీతోపాటు టీ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి (Revanth) ఉన్నారు. 2, 3 నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోపు టీ పీసీసీ చీఫ్‌ను నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందని విశ్వసనీయ సమాచారం. టీపీసీసీ చీఫ్ పోస్ట్ కోసం సీనియర్ నేతలు లాబీయింగ్ చేస్తున్నారు.
జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి..?
టీ పీసీసీ చీఫ్ పోస్ట్ రేసులో ముందు వరసలో ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి (Jagga Reddy) ఉన్నారు. ప్రస్తుతం ఆయన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ సీటు సంగారెడ్డి నుంచి ఓడిపోయారు. లేదంటే మంత్రి పదవీ వరించేదని అతని సన్నిహితులు చెబుతుంటారు. పీసీసీ అధ్యక్ష పదవీ కోసం జగ్గారెడ్డి ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేస్తున్నారు. అధ్యక్ష పదవీ కావాలని అడుగుతున్నారు. పదవీ ఇచ్చేందుకు వెనకాడితే తనకు ఎమ్మెల్సీ పదవీ ఇవ్వాలని జగ్గారెడ్డి (Jagga Reddy) అడిగే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి అవడం ఈజీ అనే సంగతి తెలిసిందే. రేవంత్ ప్రభుత్వంలో మరో ఏడు మంత్రి పదవులకు ఛాన్స్ ఉంది. అందులో ఒక పోస్ట్‌పై జగ్గారెడ్డి (Jagga Reddy) కన్నేసినట్టు తెలుస్తోంది. మెదక్ లోక్ సభ నుంచి కూతురు జయారెడ్డి లేదంటే సతీమణి నిర్మలకు సీటు ఇవ్వాలని కోరుతున్నారని తెలిసింది.
వివేక్, రాజగోపాల్ రెడ్డి కూడా
జగ్గారెడ్డి (Jagga Reddy) తర్వాత రేసులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఉంటారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో మంత్రి పదవీ మిస్సయ్యింది. తప్పకుండా బెర్త్ దక్కేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ మంత్రిగా సీఎం రేవంత్ అవకాశం ఇవ్వలేదు. మంత్రివర్గ విస్తరణలో తీసుకుంటారనే గ్యారంటీ లేదు. టీ పీసీసీ చీఫ్ పదవీ వైపు జీవన్ రెడ్డి చూస్తున్నారు. వీరిద్దరితోపాటు గడ్డం వివేకానంద (Vivek), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) పేర్లు కూడా టీ పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికీ పదవీ దక్కుతుందో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.