Scholarship: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థినులకు విప్రో స్కాలర్‌షిప్
ABN , Publish Date - Sep 20 , 2024 | 05:09 AM
పదోతరగతి, ఇంటర్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ప్రస్తుతం ఫుల్‌టైం డిగ్రీ చదువుతున్న విద్యార్థినులకు విప్రో కన్జ్యూమర్ కేర్ 9వ ఎడిషన్ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించింది.
పదోతరగతి, ఇంటర్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ప్రస్తుతం ఫుల్‌టైం డిగ్రీ చదువుతున్న విద్యార్థినులకు విప్రో కన్జ్యూమర్ కేర్ 9వ ఎడిషన్ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో విప్రో కన్జ్యూమర్ కేర్ గ్లోబల్ హెడ్ నారాయణ్, విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ ఖత్రి వివరాలు ప్రకటించారు.
ఈసారి 1500 మందికి ఉపకార వేతనాలు అందిస్తామని ప్రకటించారు. ప్రతిభ ఆధారంగా స్కాలర్‌షి్‌పనకు ఎంపికచేసి ఏడాదికి రూ. 24వేల చొప్పున అందిస్తామన్నారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, సైన్స్ ఆసక్తిగలవారు ఈనెల 30లోపు సంతూర్ స్కాలర్‌షిప్స్ డాట్ కాం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.