అంతా చేస్తుంది మా అన్న

ABN, Publish Date - Dec 11 , 2024 | 01:49 PM

ఇన్నాళ్లు తాను సైలెంట్‌గా ఉన్నానన్నార మంచు మనోజ్. ఈ మంచు మనోజ్.. ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా? మంచి కోసం నిలబడుతున్నాడా? అనేది ఈ రోజు సాయంత్రం తాను నిర్వహించనున్న ప్రెస్ మీట్‌లో స్పష్టమవుతుందన్నారు. తన తండ్రి మోహన్ బాబుపై గన్ పెట్టి కాల్చే వినయ్‌కు, మా అన్నయ్య విష్ణుకు ఈ రోజు సాయంత్రం ప్రతిది వివరిస్తాన్నారు. తనకు తీవ్ర గాయాలయ్యాయన్నారు.

ఈ నేపథ్యంలో తనకు కొంత సమయం ఇవ్వాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. ఆ క్రమంలో కొంత ఆలస్యంగా తాను పోలీసుల వద్దకు వెళ్తున్నట్లు చెప్పారు. తాను మద్యానికి బానిసైనట్లు వస్తున్న ఆరోపణలపై మంచు మనోజ్ వివరిణ ఇచ్చారు. తాను మద్యం తాగి.. ఎవరిపైన అయినా దాడి చేశానా? అని ప్రశ్నించారు.

అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉంటే బయట పెట్టాలన్నారు. ఇంట్లోని సీసీ కెమెరాలు తీసినా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందన్నారు. దొంగతనానికి గురైన సీసీ కెమెరాలు తెప్పిస్తే.. అన్ని విషయాలు బహిర్గతమవుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో చోరీకి గురైన సీసీ కెమెరాలు తెప్పించాలని మంచు విష్ణు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 11 , 2024 | 01:51 PM