Minister BC Janardhan Reddy: జగన్ పాలనలో పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:45 PM
Minister BC Janardhan Reddy: వైసీపీపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పాలనలోె అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు.

అనంతపురం: జగన్ మోహన్ రెడ్డి పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. నిర్వీర్యమైన వ్యవస్థలన్నిటిని చంద్రబాబు ఆధ్వర్యంలో పునర్ వైభవం తెస్తున్నామని అన్నారు. గుంతలమయమైన రహదారులను రూ.1061 కోట్లతో మరమ్మతులు చేపట్టామని చెప్పారు. జగన్ పరిపాలన వల్ల పరిశ్రమలు వెనక్కి వెళ్లాయని విమర్శించారు. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
పీపీ మోడల్ తరహాలో 3500 కిలోమీటర్ల రహదారులకు ఎస్టిమేషన్స్ తయారు చేశామన్నారు. రాష్ట్ర రహదారులను నేషనల్ హైవేకు అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లా రహదారుల అభివృద్ధికి రూ.24 కోట్ల కేటాయించారన్నారు. తాడిపత్రికి రూ.11 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటికే ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
AP News: ఆ పదవి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యూహం
Read Latest AP News And Telugu News