Share News

Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు

ABN , Publish Date - Jan 13 , 2025 | 08:23 AM

Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ఘనంగా చేసుకున్నారు. పిల్లలు, పెద్దలంతా తెల్లవారుజామున లేచి ఒకదగ్గర చేరి ఎంతో ఉత్సాహంగా భోగి మంటలను వేసుకున్నారు. భోగి మంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమైనట్లు పెద్దలు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ కనపడుతోంది.

Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల జరిగే ఈ వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి పండుగ వేడుకలను ఊరువాడ సందడిగా జరిగాయి. పల్లెలు, పట్నాలు అన్న తేడా లేకుండా ప్రజలు వేకువ జామునే నిద్రలేచి భోగి మంటలు వేసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సంక్రాంత్రి సందడి వాతావరణం మొదలైంది. విజయవాడలో వాడవాడలా ఘనంగా భోగి పండుగను చేసుకున్నారు.విజయవాడ ఎన్టీఆర్ భవన్‌లో జరిగే భోగి వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని) పాల్గొన్నారు.

భోగి వేడుకల్లో పాల్గొన్న ఏపీ మంత్రి నారాయణ

నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భోగి వేడుకలు సందడిగా జరిగాయి. పలు ప్రాంతాల్లో భోగి వేడుకల్లో ఏపీ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలను మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విప్లవాత్మాక పథకాలు, ఉపాధి కల్పన, అభివృద్ధి చేసి చూపుతామని హామీ ఇచ్చారు. నగరంతో పాటు అన్ని ప్రాంతాల్లో భోగి మంటలు వేసి, ఆనందంలో ప్రజలు మునిగిపోయారు.


సింహగిరిపై ఘనంగా భోగి వేడుకలు

విశాఖపట్నం: సింహాచలంలోని సింహగిరిపై ఘనంగా భోగి సంబరాలు చేసుకున్నారు. భోగి మంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలను ఆలయ ఈవో త్రినాధరావు ప్రారంభించారు. ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న మాడ వీధిలో భోగి మంటలు వేశారు. గ్రామీణ వాతావరణంలో తలపిస్తూ, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.భోగి సందర్భంగా స్వామివారిని రైతులు సింహాద్రి అప్పన్నకు కొత్త పంటను సమర్పించుకుంటున్నారు. విశాఖ జగదాంబ జంక్షన్‌లో, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే ,వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. తప్పిడి గుళ్లు, కోలాటాలతో భోగి వేడుకలు సందడిగా జరిగాయి. విశాఖ బీచ్ రోడ్ వైఎంసీ ఎదురుగా భోగి మంటలు వేసుకున్నారు. గో- ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో భోగి వేడుకలు జరిగాయి."లక్ష" ఆవు పిడకలతో భోగిమంట వేసుకున్నారు.

ఏలూరులో సందడిగా భోగి వేడుకలు

ఏలూరు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ సంబరాలు జరిగాయి. ఊరూవాడా భోగి మంటలు చేసుకున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, పెదవేగి మండలం దుగ్గిరాలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు.


హైదరాబాద్‌లో భోగి వేడుకలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ఘనంగా చేసుకున్నారు. పిల్లలు, పెద్దలంతా తెల్లవారుజామున లేచి ఒకదగ్గర చేరి ఎంతో ఉత్సాహంగా భోగి మంటలను వేసుకున్నారు. భోగి మంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమైనట్లు పెద్దలు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ కనపడుతోంది. భోగి మంటల్లో పనికిరాని ఇంట్లో పాత సామాన్లను వేశారు. భాగ్యనగరంలో భోగి వేడుకల్లో చిన్నా పెద్ద అంతా కలిసి పాల్గొన్నారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, నిజాంపేట్, ప్రగతి నగర్, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్‌మెంట్లలో భోగి సంబరాలు చేసుకున్నారు. ఇళ్ల ముందు భోగి మంటలు వేసి సందడి చేశారు. భవ్యస్ తులసీవనం గేటెడ్ కమ్యూనిటీలో భోగి మంటలు కోలాహలంగా జరిగాయి.

సూర్యాపేటలో భోగి వేడుకలు

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలో భోగి పండుగను సందడిగా చేసుకున్నారు. పలు కూడళ్లలో స్థానికులతో కలిసి సంబరాల్లో మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.

కూసుమంచిలో భోగి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి

ఖమ్మం: కూసుమంచిలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ నేతలు భారీగా పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు..

Minister Nara Lokesh: భోగి పండుగ సరికొత్త కాంతులు తీసుకురావాలి

TTD: కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 13 , 2025 | 09:59 AM