Share News

New Year-2025: ఏపీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కూటమి అగ్రనేతలు..

ABN , Publish Date - Jan 01 , 2025 | 09:00 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఆశలు, ఆశయాలు నిర్దేశించుకోవాలని, వాటిని నేరవేర్చుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు.

New Year-2025: ఏపీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కూటమి అగ్రనేతలు..
New Year-2025

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు మంత్రులు, కూటమి నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ఏపీ ప్రజలు అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తులతుగాలని వారు ఆకాంక్షించారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు మరింత ఆదాయం పొంది సంతోషంగా ఉండాలని కోరారు. నూతన ఏడాదిలో ప్రజలు చేపట్టే ప్రతి పనికీ దేవుడు తోడుగా ఉండాలని, ఆయా పనుల్లో వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్లు చేస్తూ 2025 సంవత్సరానికి స్వాగతం పలికారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఆశలు, ఆశయాలు నిర్దేశించుకోవాలని, వాటిని నేరవేర్చుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు.. రాష్ట్ర పునఃనిర్మాణానికి అంకితం కావాలని కోరుకుంటున్నట్లు చెప్తూనే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.


తెలుగు ప్రజలందరికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, యువకులు ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. రైతులు, కార్మికులు, కూలీలు సహా కష్టపడే పని చేసే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి ఆకాశమే హద్దుకు సాగాలని కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.


"అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నా. గడచిన ఏడాదిలో రాష్ట్ర ప్రజలు విధ్వంస, నియంతృత్వ పాలనను తరిమికొట్టి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించారు. ఆంధ్రప్రదేశ్‪ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఎన్నో ఆశలు, ఆనందాలు, సంతోషాలను మోసుకువస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు"- మంత్రి నారా లోకేశ్..


కోటి ఆశలు, కొత్త వెలుగులు మోసుకొస్తున్న 2025 నూతన సంవత్సరంలో తెలుగు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆకాంక్షించారు. సంవత్సరమంతా ఉల్లాసంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఎక్స్ వేదికగా పురందేశ్వరి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.


2025 కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లోకి ఆనందోత్సాహాలు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ ప్రగతిపథంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.

Updated Date - Jan 01 , 2025 | 09:01 AM