Nara Lokesh: ఆ ఎన్నికలపై నారా లోకేష్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లకు కీలక బాధ్యతలు
ABN , Publish Date - Jan 30 , 2025 | 09:41 PM
Nara Lokesh:సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్‌గా తీసుకోవాలని మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలని చెప్పారు. కేవలం ఏడు నెలల్లోనే తీసుకువచ్చిన పెట్టుబడులు, రాబోతున్న ఉద్యోగ అవకాశాల గురించి ప్రచారం చేయాలని తెలిపారు.

అమరావతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలని చెప్పారు. కేవలం ఏడు నెలల్లోనే తీసుకువచ్చిన పెట్టుబడులు, రాబోతున్న ఉద్యోగ అవకాశాల గురించి ప్రచారం చేయాలని అన్నారు.
ఏడేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలు వివరించాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో నారా లోకేష్ సంబంధిత జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులతో భేటీ అయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజా, తూర్పు గోదావరి - పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి ఇన్‌చార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు.
2023లో టీడీపీ గెలిచిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయని అన్నారు. సాధారణ ఎన్నికలో సాధించిన ఘన విజయానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయం నాంది అయ్యాయని లోకేష్ గుర్తుచేశారు. సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్‌గా తీసుకోవాలని లోకేష్ అన్నారు. ప్రతి ఓటరును పార్టీ శ్రేణులు నేరుగా కలవాలి, సోషల్ మీడియా పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే పట్టభద్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. జగన్ రెడ్డి పాలనలో అప్పుల ఊబిగా మారిన రాష్ట్రాన్ని కేవలం 7 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా అభివృద్ధి బాట పట్టిస్తున్నారో ఓటర్లకు వివరించాలని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలని చెప్పారు. ఇన్‌చార్జ్ మంత్రులు అంతా సమావేశాలు ఏర్పాటు చేసుకొని పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం సన్నద్ధం చేయాలని నారా లోకేష్ కోరారు.