Share News

GBS Virus: బిగ్ అలర్ట్.. ఏపీలో కొత్త వైరస్.. ఆందోళనలో ప్రజలు

ABN , Publish Date - Feb 14 , 2025 | 07:58 AM

ఏపీలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జీబీఎస్‌ కేసులు పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ‌వ్యాధి వచ్చిన వారు ఒళ్లంతా తిమ్మిరిగా మారుతుంది. కండరాలు బలహీనంగా ఉంటాయి. డయేరియా, పొత్తికడుపులో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడతారు.

GBS Virus:  బిగ్ అలర్ట్.. ఏపీలో కొత్త వైరస్.. ఆందోళనలో ప్రజలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ (జీబీఎస్‌) నెమ్మదిగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి క్రమంగా వ్యాపిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పదేళ్ల బాలుడు జీబీఎస్‌ వ్యాధితో చనిపోయిన విషయం తెలియడంతో ప్రజలు వణికిపోతున్నారు. తాజగా గుంటూరు జిల్లాలో జీబీఎస్ కలకలం సృష్టిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడు కేసులు నమోదయ్యాయి. జీజీహెచ్‌లో జీబీఎస్ బాధితులు చేరారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు జీజీహెచ్ వైద్యులు తెలిపారు. వ్యాధి ఇంతగా వ్యాపిస్తున్న వైద్యశాఖ అప్రమత్తం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధితో జిల్లా ప్రజానీకం భయపడుతున్నారు. వైద్యశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


జీబీఎస్‌ లక్షణాలివే..

కొన్ని రోజుల క్రితం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో పదేళ్ల బాలుడు జీబీఎస్‌ వ్యాధితో చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. తొలుత శ్రీకాకుళం, విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన ఆ బాలుడిని ఆ తర్వాత రాగోలులోని జెమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ చిన్నారి బ్రెయిన్‌డెడ్‌ అయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. జీబీఎస్‌ అనేది శరీరంలోని నాడీవ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన, తీవ్రమైన నరాల వ్యాధి. ఇదొక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌. ఇది నరాలపై దాడి చేస్తుంది. దీంతో కండరాల బలహీనత, పక్షవాతం, కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది. ఈ వ్యాధి సోకడానికి కచ్చితమైన కారణం తెలియదు కానీ.. తరచుగా వైరల్‌ లేదా బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల వస్తుంది. ఇది శరీరంలో వేగంగా అభివృద్ధి చెంది రోగ నిరోధక శక్తిపై దాడిచేస్తుంది. దీనివల్ల శ్వాసకోశ కండరాలు ప్రభావితమైతే.. ఇంటెన్సివ్‌ కేర్‌లో వెంటిలేషన్‌పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. జీబీఎస్‌ అంటువ్యాధి కాదని ప్రజలకు భరోసానిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

Bird Flu : కోళ్లకు మరణశాసనం..!

Remand.. వంశీకి 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు..

Minister Kollu Ravindra : పాపం పండింది!

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 14 , 2025 | 08:07 AM