Kalisetti Appalanaidu: అసెంబ్లీకి జగన్.. టీడీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Feb 23 , 2025 | 06:39 PM
Kalisetti Appalanaidu: చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టినా...తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడటానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ చేయని అభివృద్ధిని...కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోపే చేసి చూపించామని అన్నారు.

విశాఖపట్నం: ఏపీ అసెంబ్లీకి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. అయితే వైసీపీ హయాంలో జరిగిన తప్పులకు జగన్ అసెంబ్లీలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ(ఆదివారం) విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై జగన్ మాట్లాడాలి..ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిష్కరిస్తామని మాటిచ్చారు. ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18 మంది అసెంబ్లీ సభ్యులు ఉండాలని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు కేవలం 11 స్థానాలు ఇచ్చి...ప్రతి పక్ష హోదా ఇవ్వలేదని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడటానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ చేయని అభివృద్ధిని...కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోపే చేసి చూపించామని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి మిర్చి యార్డ్‌కు వెళ్లి... పైగా ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు. చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టినా...తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు రఘువర్మకు మద్దతు ప్రకటించాయని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ సమస్యలపై రఘువర్మ అలుపెరగని పోరాటం చేశారు..ఆయన విజయానికి అందరూ కృషి చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
Rammohan Naidu: ఏపీలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి వైసీపీ కుట్ర
YSRCP: రాష్ట్రంలో రెండే రెండు పథకాలు అమలు అవుతున్నాయి: కన్నబాబు
YS Jagan: ఈ గేట్ నుండే అసెంబ్లీకి జగన్..
YSRCP: జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి
Read Latest AP News and Telugu News