Share News

YS Sharmila: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సంచలన లేఖ..

ABN , Publish Date - Jan 30 , 2025 | 08:01 PM

YS Sharmila: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మోదీ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు మద్దతు ఉపసహరించుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఉంటే.. ఎంత అభివృద్ధి అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధించడం కష్టమని చెప్పారు. హోదాతోనే అభివృద్ధి, సంపద సృష్టి సాధ్యమవుతుందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

YS Sharmila: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సంచలన లేఖ..
YS Sharmila

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి (CM Chandrababu Naidu) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) బహిరంగ లేఖ రాశారు. రేపటి నుంచి ప్రారంభం అయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై పట్టుబట్టాలని డిమాండ్ చేశారు. హోదానే రాష్ట్ర అభివృద్ధికి సంజీవని... హోదాతోనే సంపద సృష్టి అని తెలిపారు. ఏపీ అప్పుల్లో ఉందని, కొత్తగా అప్పులు పుట్టడం లేదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే సంపద సృష్టి జరగాలని.. హోదాతోనే సంపద సృష్టి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కోసం కేంద్రం వద్ద దేహి అని ప్రాధేయపడవద్దని చెప్పారు. హోదా ఉంటే కేంద్రమే 30 శాతం నిధులు రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుందని ఇప్పటికైనా తెలుసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం దావోస్‌ల చుట్టూ తిరగడం కాదని.. హోదాతో రాష్ట్రానికి కంపెనీలు క్యూ కడతాయని గ్రహించాలని అన్నారు.


పరిశ్రమలకు భారీగా రాయితీలు, వందశాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉటుందని చెప్పారు. వందశాతం ఇన్ కం టాక్స్ రాయితీలు ఉండటంలో పరిశ్రమలు రెక్కలు కట్టుకొని రాష్ట్రానికి వస్తాయని,, దీంతో లక్షల్లో ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పుకొచ్చారు. పన్ను రాయితీలతో అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయని చెప్పారు. సగం ధరకే విద్యుత్ పంపిణీ జరుగుతుందన్నారు. ఇప్పటికే హోదా సాధించుకున్న రాష్ట్రాల్లో పరిశ్రమల అభివృద్ధి 400 రెట్లుగా ఉందని గుర్తుచేశారు. ఇన్ని లాభాలు హోదాతో సాధ్యం అవుతుంటే.. వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఉంటే.. ఎంత అభివృద్ధి అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు.


ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసహరించుకోవాలని అన్నారు. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం మీకు ఉన్నప్పుడు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. మీ మద్దతుతో అధికారం అనుభవిస్తున్న మోదీ.. రాష్ట్ర విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31 నుంచి జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూటమి ఎంపీలు తమ గళం విప్పాలని అన్నారు. పదేళ్లు హోదా ఇస్తామని ఇచ్చిన మాట మీద ప్రధాని మోదీని నిలదీయాలని చెప్పారు. హోదా ఇవ్వకపోతే కేంద్రానికి ఇచ్చిన మద్దతును తక్షణం ఉపసంహరించుకోవాలని కోరారు. లేకుంటే రాష్ట్ర ప్రజల ముందు మరోసారి మిమ్మల్ని ద్రోహిగా నిలబెడతామని వైఎస్ షర్మిల హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే

Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్

Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు

AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 30 , 2025 | 09:18 PM